Allu Arjun: తెలంగాణ సర్కార్ నేడు గద్దర్ అవార్డులను(Gaddar Award) ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. నేడు ఉదయం ఈ అవార్డుల ప్రకటన జాబితా విడుదల చేశారు అయితే ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఉత్తమ నటుడిగా(Best Actor) ఎంపిక కావడం విశేషం. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో తన నటనకు గాను ఈయనకు ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. ఇలా ఈ అవార్డుకు తనని ఎంపిక చేయటం పట్ల అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక డైరెక్టర్ సుకుమార్ అలాగే నిర్మాతలకు కూడా ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని తెలిపారు. ఇక ఈ గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నానని, మీ మద్దతు ఎల్లప్పుడూ నాలో స్ఫూర్తిని నింపుతుంది అంటూ బన్నీ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు…
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల నటనకు గాను వారికి అవార్డులతో గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో నంది అవార్డులను ప్రకటించేవారు కానీ కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అవార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పక్కన పెట్టేసాయి. అయితే ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నంది అవార్డులను కాస్త గద్దర్ అవార్డులుగా పేర్లు మార్చిన విషయం తెలిసిందే. అయితే 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు.
అభిమానులకు అంకితం…
నేడు దిల్ రాజుతో పాటు సినీ నటి జయసుధ ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ జాబితాలో సినీ నటుడు అల్లు అర్జున్ కు పుష్ప 2 సినిమాలో నటించినందుకుగాను ఆయనకు గద్దర్ అవార్డుతో పురస్కరించబోతున్నారు. ఉత్తమ నటుడి జాబితాలో అల్లు అర్జున్ పేరు ప్రకటించడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ అవార్డు పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా ఈ అవార్డును తన అభిమానులకే అంకితం చేస్తున్నానంటూ మరోసారి బన్నీ అభిమానుల మనసు దోచేశారు.
I am truly honoured to receive the first Best Actor award for #Pushpa2 at the #GaddarTelanganaFilmAwards 2024.
Heartfelt thanks to the Government of Telangana for this prestigious honour .
All credit goes to my director Sukumar garu, my producers, and the entire Pushpa team.
I…
— Allu Arjun (@alluarjun) May 29, 2025
ఇక పుష్ప 2 సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ సినిమాతో బన్నీ సరికొత్త రికార్డులను సృష్టించారు అయితే ఇదివరకే పుష్ప సినిమాకు కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే ఈ సినిమాకు ఉత్తమ జాతీయ నటుడిగా కూడా అల్లు అర్జున్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరి పుష్ప 2 ముందు ముందు ఎలాంటి అవార్డులను అందుకుంటుందో తెలియాల్సి ఉంది. బన్నీ గద్దర్ అవార్డుకు ఎంపిక కావడంతో అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బన్నీ కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అట్లీ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనుంది.