Elon musk is set to become worlds first dollar trillionaire: స్పేస్ ఎక్స్, టెస్లాతో ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కూడా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. అదేమంటే.. మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకోబుతున్నారు. ప్రపంచలోనే తొలి ట్రిలియనీర్ గా నిలవనున్నారు. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్ ఫార్మా కనెక్ట్ అకాడమీ పేర్కొన్నది. ప్రతి ఏడాది మస్క్ ఆదాయం పెరుగుతున్న గణాంకాల ఆధారంగా ఈ అంచనా వేశారు. మస్క్ వార్షిక సంపద వృద్ధి సుమారు 109.88గా ఉన్నట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికైనటువంటి ఎక్స్ ప్లాట్ పామ్ యజమాని అయినటువంటి మస్క్ ప్రస్తుతం 237 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఎలన్ మస్క్.. ఆరు కంపెనీలకు ఫౌండర్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి టెస్లా, స్పేస్ ఎక్స్ దీంట్లో ఉన్నాయి. టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 669.28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్లకు వచ్చే ఏడాది చేరే అవకాశాలు భారీగా ఉన్నాయి.
Also Read: రేప్ చేయాలని చూస్తే చచ్చారే.. మృగాళ్ల పనిపట్టే సరికొత్త కండోమ్, ఐడియా బాగుంది మేడం!
ప్రపంచ సంపన్నులల్లో ట్రిలియనీర్లు కాబోతున్న ఇతర వ్యాపారవేత్తలను కూడా అంచనా వేశారు. ట్రిలియనీరు క్లబ్ లో చేరనున్న వారిలో భారతీయ వ్యాపారి గౌతమ్ అదానీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఎన్విడియా సీఈఓ జెన్ సెన్ హువాంగ్, ఇండోనేషియా మ్యాగ్నెట్ ప్రజోగో పంగెస్ట్ కూడా ఉన్నారు. 2028 వరకు ఈ ముగ్గురు ట్రిలియనీర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ ఫార్మా కనెక్ట్ అంచనా వేసింది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లూయిస్ ఓనర్ బెర్నార్డ్ అర్నాల్ట్ 2030 వరకు ట్రిలియనీరు అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Also Read: ఏకధాటిగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి.. చివరికి ఆస్పత్రిలో..
2012లో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆయన ఆస్తి 2 బిలియన్ల డాలర్లు. అయితే, 2021లో తొలిసారి ఆయన ప్రపంచ కుబేరుల్లో బేజోస్ ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. 2022 డిసెంబర్ లో ఆయన కొన్నాళ్లు ఆ స్థానాన్ని కోల్పోయారు. మళ్లీ ఆర్నెళ్ల తరువాత ఫస్ట్ ప్లేస్ ఆక్రమించుకున్న విషయం తెలిసిందే.