BigTV English

ALBERT EINSTEIN : ఐన్‌స్టీన్ చమక్కులు..!

ALBERT EINSTEIN : ఐన్‌స్టీన్ చమక్కులు..!
ALBERT EINSTEIN

The Secret Life of Albert Einstein : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్‌గా ఐన్‌స్టీన్ చాలా మందికి తెలుసు. కానీ.. ఆయనలోని హస్యచతురత గురించి మాత్రం బహుకొద్ది మందికే అవగాహన ఉంది. ఆయన కామిక్ సెన్స్ ఎలా ఉండేదో చెప్పే కొన్ని ఉదాహరణలు..


ఐన్‌స్టీన్ కారు నడిపేందుకు ఓ డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ రోజంతా ఐన్‌స్టీన్ వెళ్లే మీటింగులకు వెళ్లి.. చివరి వరుసలో కూర్చొని ఆయన సైన్స్ ప్రసంగాలు వినేవాడు. అలా వింటూ వింటూ కొంతకాలానికి ఆ డ్రైవరుకూ సైన్స్ మీద మంచి అవగాహన వచ్చింది. ఓసారి ఐన్‌స్టీన్‌ను ఓ లెక్చర్ కోసం కారులో తీసుకుపోతూ..‘సార్.. ఈ రోజు మీ బదులు నాకు ఈ రోజు లెక్చర్ ఇచ్చే అవకాశం ఇవ్వండి’ అని అడిగాడు. దీనికి ఐన్‌స్టీన్ సరేనంటూ కారును ఓ మేకప్ స్టూడియోకి తీసుకుపోయి.. అక్కడ ఇద్దరూ తమ గెటప్‌లు మార్చుకుని మీటింగ్‌కు హాజరయ్యారు.

అనుకున్నట్లుగానే ఆ రోజు డ్రైవర్ స్టేజీ మీద అద్భుతమైన లెక్చర్ ఇవ్వగా, అసలు ఐన్‌స్టీన్ మాత్రం వెనక వరుసలో డ్రైవర్ గెటప్‌లో కూర్చొన్నాడు. లెక్చర్ తర్వాత హాలంతా చప్పట్లతో మారుమోగుతుండగా, ఐన్‌స్టీన్ తన డ్రైవర్ ప్రతిభకు ముచ్చట పడుతున్నాడు. ఇంతలో ఊహించని రీతిలో హాల్‌లో ఒకరు లేచి.. ఆ లెక్చర్‌కు సంబంధించిన ఓ ప్రశ్న అడిగాడు. దీంతో ఏం చేయాలో ఆ స్టేజీ మీదున్న డ్రైవర్‌కు తోచక బిక్కుబిక్కుమంటూ నిలబడి దిక్కులు చూశాడు. ఇంతలో వెనక వరుసలో కూర్చొన్న ఐన్‌స్టీన్ పెద్దగా.. ‘ఇంత చిన్న ప్రశ్నకు మా బాస్ జవాబివ్వాలా ఏంటి? ఆయన డ్రైవర్‌గా నేనే మీ ప్రశ్నకు జవాబు చెబుతా..’ అంటూ గడగడా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. దీంతో సభ మరోసారి చప్పట్లతో నిండిపోయింది.


మరోసారి ఒక సభలో.. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం (థియరీ ఆఫ్ రిలెటివిటీ) గురించి ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ‘మీ సిద్ధాంతాన్ని చదువురాని వాడు కూడా అర్థం చేసుకునేలా ఉదాహరణ రూపంలో చెప్పండి’ అని అడిగారు. దానికి ఐన్‌స్టీన్.. ‘నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చొని ఆమె చెప్పే ముచ్చట్లు వింటున్నప్పుడు.. ఇంకెప్పుడు అయిపోతుందో ఈ ముచ్చట’ అన్నట్లు అనిపిస్తుంది. అదే.. నీ ప్రియురాలి ఒడిలో పడుకుని ఆమె కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తున్నావనుకో.. .. అప్పుడు యుగాలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి. నా సాపేక్ష సిద్ధాంతం దీనిని బట్టే కనిపెట్టానోయ్..!’ అంటూ జవావివ్వగా, సభ అంతా నవ్వులతో నిండిపోయింది.

Read more: ఆడపిల్లే శాపం అనుకునే వాళ్లకి ఈ తండ్రి స్పూర్తి..

ఐన్‌స్టీన్‌కి స్నానం చేశాక.. ఏ డ్రస్ కనిపిస్తే అది వేసుకుని బయటికి వెళ్లిపోయే అలవాటుండేది. దీని గురించి ఆయన భార్య ‘మీకు మంచి పేరు ఉంది. కనుక బయటకు వెళ్లేటప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకో’ అంటూ విసుక్కునేది. దానికి ఐన్‌‌స్టీన్.. ‘అక్కడికి వచ్చేదంతా నాకు బాగా తెలిసిన వాళ్ళే. కాబట్టి వాళ్లెవరూ నా డ్రస్ గురించి అంతగా పట్టించుకోరులే’ అనేవాడు. ఒకసారి ఆయన పెద్ద అంతర్జాతీయ సెమినార్‌కు బయలుదేరబోతూ పాత బట్టలే వేసుకోవటం చూసిన ఆయన భార్య ‘కనీసం ఇప్పుడైనా మంచి బట్టలు వేసుకోవచ్చుగా’ అని కోప్పడింది. దానికి ఐన్‌స్టీన్ ‘అక్కడ నాకు తెలిసిన వాడెవడూ లేడు. ఇంకెందుకు మంచి బట్టలు’ అంటూ అవే బట్టలతో సెమినార్‌కి వెళ్లిపోయాడట.

ఐన్‌స్టీన్‌కి సుప్రసిద్ధ నటుడైన చార్లీ చాప్లిన్ అంటే ఇష్టం. 1931లో ఒక సందర్భంలో ఆయనను కలిశాడు. చాప్లిన్‌ను చూడగానే ‘మీ యాక్టింగ్‌లో నాకు నచ్చేది ఏమిటంటే మీరు ఒక్క మాట మాట్లాడకపోయినా.. ప్రపంచంలోని అందరూ దాన్ని అర్థం చేసుకోగలరు’ అన్నాడు ఐన్ స్టీన్. దానికి సమాధానంగా చాప్లిన్.. ‘మీరన్నది నిజమే గానీ.. నాకంటే మీ చరిష్మాయే ఎక్కువ. నిజానికి మీరు చెప్పేది ఒక్క ముక్క అర్థమై చావకపోయినా.. ఈ ప్రపంచమంతా మిమ్మల్ని ఆరాధిస్తుంది’ అనటంతో ఈసారి పడిపడి నవ్వటం ఐన్‌స్టీన్ వంతైంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×