Afghanistan: అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 71 మంది ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటన హెరాత్-ఇస్లాం కాలా హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక ట్రక్కు, బైక్‌ను ఢీకొట్టింది. గుజారా జిల్లాలో సంభవించింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి, దాదాపు అందరూ సజీవదహనమయ్యారు. కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. మృతులంతా ఇరాన్ నుంచి బహిష్కరించబడిన అప్గానిస్థాన్ వలసదారులని అధికారులు తెలిపారు.
ట్రక్కును ఢీకొన్న బస్సు..
ప్రాథమిక అంచనాల ప్రకారం, బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బస్సు మొదట మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత ట్రక్కుతో గట్టిగా బాదుకోవడంతో మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారి మొహమ్మద్ యూసుఫ్ సయీది తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కులోని ఇద్దరు, మోటార్‌సైకిల్‌పై ఉన్న ఇద్దరు కూడా మరణించారు. మంటల తీవ్రత వల్ల చాలా మంది శరీరాలు కాలిపోయాయి. దీంతో మృతులను గుర్తించడం చాలా కష్టతరంగా మారిందన్నారు.
Also Read: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..
తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది..
అక్కడి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎక్కువ మందిని రక్షించలేకపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం ఇటీవలి కాలంలో అఫ్గానిస్థాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు దుర్ఘటనల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ నుంచి బలవంతంగా తిరిగి పంపబడిన వలసదారులు కాబూల్‌కు వెళ్తుండగా ఈ విషాదం సంభవించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఈ దుర్ఘటన యొక్క భయానకతను వెల్లడిస్తున్నాయి.
బస్సులో మంటలు.. 71 మంది సజీవదహనం!
అఫ్గానిస్థాన్‌లోని హోరాత్ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం
ఓ ట్రక్కును ఢీకొన్న హోరాత్-ఇస్లాం కాలా హైవేపై ఇరాన్ వలసదారులను తరలిస్తున్న బస్సు
ఈ దుర్ఘటనలో బస్సులో మంటలు చెలరేగి దాదాపు 71 మంది మృతి
మృతులలో 17 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం… pic.twitter.com/kZpPztrvDD
— BIG TV Breaking News (@bigtvtelugu) August 20, 2025