Jr.NTR:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా తర్వాత చేసిన చిత్రం దేవర(Devara ). మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత కమర్షియల్ గా మంచి విజయం సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. ఎన్టీఆర్ నటన, డాన్స్, అనిరుద్ (Anirudh) అందించిన అద్భుతమైన పాటలు.. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి రావడం వల్ల సినిమా సూపర్ హిట్ అయిందనే వార్తలు వినిపించాయి. అదే సమయంలో దేవర 2 కూడా ప్రకటించడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు సినీ విశ్లేషకులు.
ఆగిపోయిన దేవర 2..
ముఖ్యంగా పార్ట్ 2కి అవసరమయ్యే స్టోరీ ఇందులో లేదని, ఒకవేళ రెండవ భాగం తీస్తే.. చాలా రొటీన్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తుందని అటు విశ్లేషకులు కూడా తెలిపారు. కానీ దేవర 2 ఉంటుందని డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా కూడా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయేసరికి దేవర 2 కూడా వర్కౌట్ అయ్యే సినిమా కాదని, అందుకే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికంటే ముందే ఆపేస్తే బెటరని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకొని కొరటాల శివకు చెప్పారట. అందుకు కొరటాల శివ కూడా ఓకే చెప్పారని దేవర స్క్రిప్ట్ పేపర్లను పక్కనపెట్టి నాగచైతన్యతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..
ఇకపోతే రూమర్స్ దావాణంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఇలాంటి క్లారిటీ ఊహించలేదని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఇక మేకర్స్ తెలిపిన వివరాల మేరకు అందరూ అనుకుంటున్నట్టుగా దేవర 2 ఆగిపోలేదు. స్క్రిప్ట్ వర్క్ తో పాటు డైలాగు వెర్షన్ సహా అన్ని పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది.. అయితే ఈ సీక్వెల్ కి ప్రస్తుతానికి ఎలాంటి హైప్ క్రేజ్ ఏర్పడదు అనడంలో సందేహం లేదు. ఒకవేళ అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా దేవరకి కుదిరినట్టుగా మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదురుతుందో లేదో కానీ బాహుబలి 2, పుష్ప2, సలార్ 2, కేజీఎఫ్ 2 రేంజ్ అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా ఏర్పడుతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి అయితే దేవర 2 పై ఊహించని హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.. మరి ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఎన్టీఆర్ సినిమాలు..
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైన విషయం తెలిసిందే.