BigTV English

Tollywood : కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. నేడు నిర్మాతలతో ఛాంబర్ పెద్దల భేటీ..

Tollywood : కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. నేడు నిర్మాతలతో ఛాంబర్ పెద్దల భేటీ..

Tollywood : టాలీవుడ్ నిర్మాతలకు, సినీ కార్మికులకు మధ్య గత కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ కార్మికులు వేతనాలను పెంచాలని నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దీని గురించి చర్చలు జరిగాయి. కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ప్రతినిధులు ఓకే అన్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగాయి.. ఈ చర్చల్లో భాగంగా 9 టు 9 కాల్షీట్లపైనే చర్చ జరిగింది. ఈ విషయంల పట్టువిడుపు ఉండాలని ఫెడరేషన్ ను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించారు.. కానీ కార్మికులు దీనిపై మరోసారి నిర్మాతల తో భేటీ కానున్నారని తెలుస్తుంది.


కార్మికులతో చిరంజీవి భేటీ…

గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు వేతనాల పెంపు పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు జీతాల పెంపు పై కార్మికులు నిర్మాతలను కలిశారు.. అయితే వాళ్ల బేటిలు ఫలించినట్లు కనిపించలేదు.. నిన్న మెగాస్టార్ చిరంజీవితో ఛాంబర్ పెద్దలు భేటీ అయ్యారు.. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో చిరంజీవి నిర్మాతలతో మాట్లాడి జీతాల గురించి చర్చిస్తానని భరోసా ఇచ్చారు. మేము ఐక్యంగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం అన్నారు. అయితే మా డబ్బులు మాకు ఇవ్వండి.. 13 కోట్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి…మా కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించండి అని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. నిర్మాతలకు కావలసిన స్కిల్స్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన చర్చల్లో సమస్య ఒక కొలిక్కి రాలేదు.. కొన్ని యూనియన్లకు జీతాలు పెంచుతామని నిర్మాతలు చెప్పినట్లు తెలుస్తుంది.


Also Read : పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆరాధ్య..

నేడు నిర్మాతలతో ఛాంబర్ పెద్దల భేటీ.. 

సినీ ఇండస్ట్రీలో కార్మికుల నిరసనలు తెలిసిందే.. ఎంత పని చేస్తున్నా చాలీచాలని జీతాలు వస్తున్నాయంటూ సినీ కార్మికులు నిరసనలు మొదలుపెట్టారు.. జీతాలు పెంచాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 17 రోజుల నుంచి సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.. ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో సమావేశం కానున్నారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు. నిన్న మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కృష్ణ నగర్ లో జరిగిన సినీ కార్మిక సంఘాల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఫిలిం ఛాంబర్ , ఫెడరేషన్ చర్చల్లో కార్మికులకు పర్సంటేజ్ పెంచుతామని నిర్మాతలు చెప్పారు. ఇక ఈరోజు సాయంత్రం జరిగే ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో సమ్మె సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సమస్య ఈరోజు తో పరిష్కారం అయితే రేపటి నుంచి యధావిధిగా షూటింగ్లో జరుగుతాయని తెలుస్తుంది. మరి నిర్మాతలకు ఛాంబర్ పెద్దలకు మధ్య చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి..

Related News

Tamannaah Bhatia: అలాంటి సీన్స్ చేశాకే నా కెరియర్ మారిపోయింది -తమన్నా

Telugu Actors : ఈ హీరోలు ఒకే ఫ్యామిలీ.. కానీ, తల్లులు వేరు వేరు…

Mammootty: అనారోగ్యంతో మమ్ముట్టి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన మోహన్ లాల్!

Jr.NTR: దేవర 2 అందుకే ఆగిపోయింది.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!

Mirai Movie : తేజా ‘మిరాయ్ ‘ మళ్లీ వాయిదా.. అసలు రిలీజ్ అవుతుందా?

Big Stories

×