BigTV English

Argentina New President: 70 వేల మంది ఉద్యోగులపై వేటు.. అర్జెంటీనా అధ్యక్షుడు షాకింగ్ డెసిషన్.. ఎందుకంటే?

Argentina New President: 70 వేల మంది ఉద్యోగులపై వేటు.. అర్జెంటీనా అధ్యక్షుడు షాకింగ్ డెసిషన్.. ఎందుకంటే?
Argentina New President
Argentina New President

Argentina New President: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై వేటు పడుతూనే ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియకు అడ్డు తెర మాత్రం పడటం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా అర్జెంటీనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియోర్ మిలీ ఈ మేరకు ప్రకటించారు.


భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని అర్జెంటీనా అధ్యక్షుడు జావియెర్ మిలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. అతి త్వరలోనే జావియెర్ ప్రభుత్వం దాదాపు 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించింది. అర్జెంటీనా ప్రభుత్వంలో ఆర్థికంగా ఉన్న పరిస్థితుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: గాజాలో దారుణం.. ఆహారం కోసం వెళ్లి 18 మంది మృతి(VIDEO)


అర్జెంటీనా ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల ఒప్పందం త్వరలో ముగియనుంది. ఇప్పటికే గతేడాది కాంట్రాక్టు ముగిసినా మరో 3 నెలలు పొడిగించింది అర్జెంటీనా ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఇచ్చిన రెన్యువల్‌తో మరోసారి అలా చేయబోమరి ప్రెసిడెంట్ జావియెర్ మిలీ ఇప్పటికే డిసెంబర్ నెలలో ప్రకటించారు.

అర్జెంటీనాలో 3.5 మిలియన్(35 లక్షలు) ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన ఉద్యోగాల తొలగింపుపై ఇప్పటికే ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్టేట్ వర్కర్స్ యూనియన్ లీడర్ ట్విట్టర్ వేదికగా దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే 70వేల మంది భారీ ఉద్యోగుల తొలగింపుకు అర్జెంటీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

అర్జెంటీనా దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ మేరకు మిలీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related News

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Meta Offer: ఏంటి బాసూ.. రూ.13000 కోట్ల జాబ్ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా? మెటాకే షాక్ ఇచ్చాడుగా!

Big Stories

×