ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జును కలిశారని, తాగునీటి కొరతను అధిగమించేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా మాల్దీవులకు చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందించడంతో పాటు సైనిక శిక్షణ అందిస్తుందని డాక్టర్ మహ్మద్ మయిజ్జు తెలిపారు.
నవంబర్ 2023 మహ్మద్ మయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాల్దీవులు చైనా వైపు మొగ్గు చూపుతోంది. దీంతో ఇరు దేశాలు పరస్పర సహకార మంత్రం జపిస్తున్నాయి. ఇక తాజాగా తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా పంపిన నీటితో తమ దేశంలో మంచి నీటి కొరతను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. మాల్దీవులకు తాగునీటి కష్టాలు రావడం ఇదేం తొలిసారి కాదు.
గతంలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న సమయంలో పొరుగున దేశాలు తాగునీటిని అందించాయి. 2014 డిసెంబరులో తీవ్రమైన నీటి కొరత ఏర్పడినప్పుడు, భారతదేశం వెంటనే విమానాల ద్వారా మాల్దీవులకు 375 టన్నుల నీటిని రవాణా చేసింది. ఆ తర్వాత కూడా ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ దీపక్ నౌకల ద్వారా 2000 టన్నుల నీటి సరఫరా చేసింది.