BigTV English

Gulf of Mexico : గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలో వెనక్కి తగ్గని ట్రంప్.. గూగుల్‌లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేర్లు మార్పు..

Gulf of Mexico : గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలో వెనక్కి తగ్గని ట్రంప్.. గూగుల్‌లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేర్లు మార్పు..

Gulf of Mexico : ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికాకు సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చారు. ఎన్నికల సమయం నుంచి ఈ ప్రకటన చేస్తూ వస్తున్న ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా మార్చుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేశారు. దీంతో ఇప్పుడు గూగుల్ సైతం ఆ ప్రాంతానికి గల్ఫ్ ఆఫ్ అమెరికా గా కొత్త పేరును సూచిస్తోంది. గూగుల్ తాజా గ్లోబెల్ మ్యాప్స్ లో ఈ విషయం వెల్లడైంది. దీంతో.. ట్రంప్ ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.


సువిశాల అమెరికాకు దిగువన, ఉత్తర అమెరికా ఖండంలోనే చివరన మెక్సికో ఉంటుంది. ఈ దేశం నుంచే అమెరికాకు వలసలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇరు దేశాల మధ్య కూడా ట్రంప్ జాతీయవాద నాయకుడు వచ్చిన తర్వాత భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించిన ట్రంప్..తొలి అస్త్రంగా ఆ ప్రాంతం పేరును మార్చారు. పైగా.. అధికారిక ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దాంతో.. గూగుల్ మ్యాప్స్ సైతం ఈ మార్పుల్ని తమ మ్యాప్స్ లో చేర్చింది.

ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన గూగుల్.. పేరు మార్పుపై తమకు ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయని తెలిపింది. అయితే.. పేర్ల విషయంలో తమకు చాలా కాలం నుంచి కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపింది. అందులో భాగంగానే ఏవైనా దేశాలు, లేదా స్థానిక ప్రభుత్వాల అధికారికంగా ఏవైనా ప్రాంతాలు, ప్రదేశాల పేర్లు మార్చితే.. అందుకు అనుగుణంగా తాము పేర్లు అప్ డేట్ చేస్తుంటామని తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలోనూ.. అలానే అనుసరించామని వెల్లడించింది.


తాజా పేర్ల మార్పు తర్వాత అమెరికాలో ఉండే యూజర్లకు సదరు ప్రాంతం “గల్ఫ్ ఆఫ్ అమెరికా” అని కనిపిస్తుండగా.. మెక్సికన్ ప్రాంత ప్రజలకు “గల్ఫ్ ఆఫ్ మెక్సికో” అని కనిపిస్తుంది. మిగతా వారందరికీ రెండు పేర్లు కనిపిస్తాయని గూగుల్ తెలుపుతోంది. కాగా.. ఈ విషయమై మెక్సికో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష చర్యలను అంగీకరించలేమని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మాకు, మిగతా ప్రపంచానికి ఈ ప్రాంతం ఎప్పటికీ గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే అంటూ.. మెక్సికో ప్రెసిడెంట్ గ్లూడియా షైన్ బామ్ వ్యాఖ్యానించారు.

Also Read :  పన్ను వసూలుపై ట్రంప్ కీలక ఆర్డర్లు.. ఇండియాపై మోయలేని పన్ను భారాలు..

అయితే.. అసలు ఈ ప్రాంతానికి మెక్సికో దేశానికి ఏం సంబంధం లేదంటూ కొందరు అమెరికన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రాంతానికి గతంలో అనేక పేర్లు ఉండేవని చెబుతున్నారు. వాటన్నింటిలో 1552 లో స్పానిష్ చరిత్రకారుడి రచనల్లో ఈ ప్రాంతానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరు స్థిరపడినట్లు చెబుతున్నారు. అంతే కాదు.. మెక్సికో దేశాన్ని కనుక్కునేందుకు 300 ఏళ్ల ముందుగానే ఈ పేరు ఉందని, దీనితో మెక్సికో దేశానికి ఎలాంటి చారిత్రక, వారసత్వ సంబంధం లేదని అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×