BigTV English
Advertisement

Great Wall of China : వేల సంవత్సరాలైనా చెక్కు చెదరని గ్రేట్‌ వాల్.. చైనా చక్రవర్తులు ఎలా నిర్మించారో తెలుసా?

Great Wall of China : ప్రపంచంలోని వింతల్లో చైనా గ్రేట్ వాల్ ఒకటి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం నాటిది ఇది. అయితే చైనా చక్రవర్తులు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి దీనిని నిర్మించారు. దాని నిర్మాణ సౌష్టవం, భౌగోళిక పరిస్థితుల కారణంగా అది ప్రపంచ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటున్నది.

Great Wall of China : వేల సంవత్సరాలైనా చెక్కు చెదరని గ్రేట్‌ వాల్.. చైనా చక్రవర్తులు ఎలా నిర్మించారో తెలుసా?

Great Wall of China : ప్రపంచంలోని వింతల్లో చైనా గ్రేట్ వాల్ ఒకటి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం నాటి కట్టడం ఇది. ఆ కాలంలో చైనా చక్రవర్తులు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ సౌష్టవం, భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రపంచ టూరిస్టులు ఇక్కడ భారీ సంఖ్యలో వస్తారు. ఈ సుందరమైన, ఎత్తైన గోడను చూడటానికి ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఆహ్లాదకరమైన గ్రేట్ వాల్ చరిత్రకారులను, ఆర్కియాలజిస్టులను కూడా మరో విషయంలో ఆలోచింపజేస్తోంది.


ఏంటంటే.. ఎంతకాలమైనా చెక్కుచెదరని గొప్పకట్టడంగా ఎలా నిలువగలుగుతోంది? అనే సందేహాలు పలువురిని వెంటాడుతున్నాయి. అయితే అందుకు ‘లివింగ్ స్కిన్’ రక్షణగా నిలుస్తోంని నార్తెన్ అరిజోనా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. రీసెర్చ్‌లో భాగంగా సాయిల్ ఎకోలజిస్ట్ ప్రొఫెసర్ మాథ్యూ బౌకర్ నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని కనుగొనే క్రమంలో చైనా వాల్ పొడవునా 480 కిలోమీటర్ల శాంపిల్స్ సేకరించింది. ఈ ప్రాంతంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ బయోక్రస్టుతో కప్పబడి ఉందని గుర్తించింది.

చైనా గ్రేట్ వాల్ నిర్మాణ సమయంలో నేలలోకి నేచురల్ మెటీరియల్స్‌తో కుదించడం ద్వారా ఈ గోడ నిర్మించబడిందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే అప్పట్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఈ క్రమంలో వాల్ క్షీణించకుండా సహజ రక్షణ రేఖను అప్పటి నిపుణులు అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఈ డిఫెన్స్ మెకానిజం ‘బయోక్రస్టులు’ అని పిలువబడే చిన్న చిన్న రూట్‌లెస్ మొక్కలు, సూక్ష్మజీవులతో తయారు చేయబడిన ‘living skin’ రూపంలో ఉంటుందని నిర్ధారించారు.


నిజానికి ‘బయోక్రస్ట్స్ ప్రపంచవ్యాప్తంగా పొడి ప్రాంతాల నేలలపై సర్వసాధారణంగా ఉంటాయి. సాధారణంగా వాటిని నిర్మాణాల్లో ఉపయోగించడం జరగదని సాయిల్ ఎకోలజిస్ట్ మాథ్యూ బౌకర్ పేర్కొన్నారు. చైనా వాల్ నిర్మాణంలో ఈ బయోక్రస్టులే కీలకపాత్ర పోషించాయి. కాబట్టి అది చెక్కు చెదరకుండా ఉంటోందని పరిశోధకులు చెప్తున్నారు. వాటిలో లేయర్డ్ చేసిన నమూనాలు స్థిరత్వాన్ని, బలాన్ని ఇస్తున్నాయట. అయితే ఇది సర్ఫేసియల్ లేయర్ మాత్రమే కాదు, సహజ క్షీణత, రాక్ వెదరింగ్ నిర్మాణం యొక్క నిరోధకతను పెంచడంలో సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషించే అద్భుతమైన ప్రక్రియ అంటున్నారు నిపుణులు.

Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×