Ancient History: కొన్ని లక్షల ఏళ్ల క్రితం లక్షల క్రితం మనిషి పుట్టాడని మనం పుస్తకాల్లో చదివి ఉంటాం. లక్షల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ ఆవిర్భవించారు. అయితే దాదాపు 8.5 లక్షల సంవత్సరాల క్రితం పురాతన మానవులు తమ సొంత పిల్లలను చంపి ఆహారంగా తీసుకునేవారని స్పెయిన్‌లోని పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. గ్రాన్ డొలినా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసున్న చిన్నారి మెడ ఒకటి ఎముక దొరికింది. ఈ ఎముకపై పరిశోధనలు చేసిన కెటలాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ పేలేఎకోలజీ అండ్ సోషల్ ఎవల్యూషన్ (ఐపీహెచ్‌ఈఎస్) శాస్త్రవేత్తలు, పదునైన వస్తువుతో తల నరికినట్టు గుర్తించారు. అయితే ఇలాంటి ఆనవాళ్లు చిన్న వయస్సు గల పిల్లలపై ఎక్కువగా కనిపించాయని.. ఇది ఓ మనిషి.. మరో మనిషిని చంపి తినడానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యమని పరిశోధకులు వివరించారు.
ఈ దారుణ ఆచారం హోమో యాంటెసెసర్స్ కాలంలో జరిగినట్లు సైంటిస్టులు తెలిపారు.. ఈ జాతి మానవులు నియాండర్తల్స్, హోమో సెపియన్స్‌లకు పూర్వీకులుగా భావించబడతారని పేర్కొన్నారు. చిన్న వయస్సు గల పిల్లల వెన్నుపూస, తలను వేరు చేసేందుకు పదునైన ఆయుధాలను ఉపయోగించేవారని సైంటిస్టులు గుర్తించారు. ఎముకలపై కనిపించిన కోత గుర్తులు ఇందుకు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
పిల్లలను జంతువుల మాదిరిగా చంపేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయని సైంటిస్ట్ పాల్‌మిరా సలడై వెల్లడించారు. ఈ ఆధారాలను బట్టి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. పురాతన మానవులు తమ సంతానాన్ని ఆహార వనరుగా ఉపయోగించుకునే వారిని తెలుస్తోంది. హోమో యాంటెసెసర్స్ 1.2 మిలియన్ నుంచి 8 లక్షల సంవత్సరాల క్రితం జీవించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ALSO READ: Software Engineer: దారుణ ఘటన.. సొసైటీ నచ్చడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్
వీరి మెదడు పరిమాణం 1000 నుంచి 1150 క్యూబిక్ సెంటీమీటర్లు ఉన్నట్టు సైంటిస్టులు తెలిపారు. ఇది ప్రస్తుత హోమో సెపియన్స్ మెదడు (1350 క్యూబిక్ సెంటీమీటర్లు) కంటే కొంత చిన్నదని వారు చెబుతున్నారు. ఈ జాతి నుంచే ఆధునిక మానవులు ఉద్భవించారని శాస్త్రవేత్తల భావన. పురాతన మానవుల జీవన విధానం, వారి మనుగడ, మరణించిన వారిని ఎలా చూసేవారు వంటి అంశాలను అర్థం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త ఆవిష్కరణ మానవ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని వెలుగులోకి తెస్తోందని చెప్పవచ్చు. సైంటిస్టులు ఇలా దీనిపై స్టడీ చేస్తే పురాతన జీవన శైలి గురించి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం సమాజం కూడా ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ALSO READ: Weather News: వర్షాల నుంచి బిగ్ రిలీఫ్.. కానీ ఈ ఏరియాల్లో పిడుగుల వర్షం..?