E-Paper
Advertisement

Iceland Volcano : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం బద్దలు

Iceland Volcano : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం బద్దలు
Advertisement

Iceland Volcano : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం బద్దలైంది. రేక్‌యానెస్(Reykjanes) ద్వీపకల్పంలోని ఈ అగ్నిపర్వతం కొన్ని వారాలుగా క్రియాశీలంగా మారింది. దీంతో సమీపంలోని 4 వేల మందిని ఇప్పటికే తరలించారు. అలాగే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక కేంద్రమైన బ్లూలాగూన్ జియోథర్మల్ స్పా‌ను కూడా మూసివేశారు.

ఈ జ్వాలాముఖి నుంచి సెకనుకు 200 క్యూబిక్ మీటర్ల లావా ఎగసిపడుతోంది. ఇటీవలి విస్ఫోటనాల కన్నా ప్రస్తుత విస్ఫోటన తీవ్రత చాలా ఎక్కువని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. లావా ఎంతో వేగంతో అన్ని దిక్కులకూ ఎగసిపడుతోందని తెలిపారు. అగ్నిపర్వతం బద్దలైన ప్రాంతం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో రాజధాని రేక్‌యావిక్(
Reykjavik) ఉంది. రాజధాని నుంచి అగ్నిపర్వత విస్ఫోటనం కనిపిస్తోందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Advertisement

గత రెండు నెలలుగా రేక్ యావిక్ చుట్టుపక్కల ఉన్న అగ్నిపర్వతాల యాక్టివిటీ బాగా పెరిగింది. గత నెలలో 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు నమోదయ్యాయి. అతి శీతల వాతావరణం నెలకొని ఉండే దేశమైన ఐస్‌లాండ్ అగ్నిపర్వతాలకు పుట్టిల్లు. 130 వరకు అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి. ఏప్రిల్ 2010లో హేయాఫ్యాత్లాయకతో
(Eyjafjallajokull) అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల భారీగా నష్టం సంభవించింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద విస్ఫోటనం అదే. భారీగా ఎగసిపడిన బూడిద ఆకాశాన్ని పూర్తిగా కమ్మేయడంతో యూరోపియన్ గగనతలాన్ని కొన్ని రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. లక్ష విమానాల రాకపోకలు రద్దయ్యాయి. 20 లక్షల మంది జనాభాపై దీని ప్రభావం పడింది. 2.7 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×