India-Pakistan War: దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పాక్, భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఫలితంగా నిధుల్లేక కటకలలాడు తోంది. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తమ దేశానికి సాయం చేయాలని అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక వ్యవస్థ విభాగం అధికారులు బయట పెట్టారు.
యద్ధానికి దిగడమే దాని పర్యావసనాలు ఎంత దారుణంగా ఉంటాయనేది దాయాది దేశం పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. తొలుత మనం బలంగా ఉండాలి. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవాలి. లేకుంటే ప్రత్యర్థులు అమాంతంగా మిగేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంతే. పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ చెప్పాల్సిన వన్నీ చెప్పింది. కొందరు అండ చూసుకుని రెచ్చిపోయింది.
నోరు జారి బుక్కైన పాక్
ఆదేశ నేతలు తమ మాటలకు పదునుపెట్టారు. తొలుత ఆదేశం వనరులపై బలంగా దెబ్బకొట్టింది భారత్. అయినా వెనక్కి తగ్గకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి చేరింది. అక్కడి అతివాదుల అండ చూసుకుని రెచ్చిపోయింది. పైగా కయ్యానికి కాలు దువ్వింది. సరిహద్దు వెంబడి దూకుడు ప్రదర్శించింది. ఫలితంగా సరిహద్దు గ్రామాల పౌరులపై క్షిపణులను ప్రయోగించింది. వాటిని ధీటుగా ఎదుర్కొన్న భారత్, తిప్పికొట్టింది.
గడిచిన మూడు నాలుగురోజులుగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నిలిపివేసింది. దీంతో అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. అక్కడి కంపెనీల సూచీలు నేలబారు చూశాయి. ఈ పరిస్థితి వస్తుందని అక్కడి పాలకులు ముందుగానే ట్రేడింగ్‌ను నిలివేసింది. దీంతో నిధులకు కష్టాలు మొదలయ్యాయి.
ALSO READ: మాకు సంబంధం లేదు.. భారత్-పాక్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటన
ప్లీజ్ సాయం చేయరంటూ..
తాజాగా పాకిస్థాన్ అసలు గుట్టు బయటపడింది. భారత్ దెబ్బకు తమ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది దాయాది దేశం పాకిస్థాన్. శత్రువు దాడులతో భారీ నష్టాలు వచ్చాయని ప్రస్తావించింది. తమ దేశానికి మరిన్ని లోన్లు ఇవ్వాలని అంతర్జాతీయ పార్టనర్స్, ముఖ్యంగా ప్రపంచబ్యాంకును కోరింది.
ఓ వైపు యుద్ధ పరిస్థితులు.. మరోవైపు స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని రాసుకొచ్చింది. ఈ క్రైసిస్ నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలంటూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఎక్స్‌లో ప్రస్తావించింది.
పాక్ పాలకుల వ్యవహారశైలిపై ఆదేశ ప్రజలు మండిపడుతున్నారు. పాలకులకు ముందస్తు చూపు లేదా? యుద్ధంలోకి దిగిన తర్వాత ఆర్థిక సంక్షోభమంటూ చెప్పడమేంటని రుసరుసలాడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని ఏ మాత్రం పట్టించుకోకుండా కయ్యానికి ఏ విధంగా కాలుదువ్వారని అంటున్నారు. దీనివల్ల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని చిన్నచిన్న వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గండం నుంచి దాయాది దేశం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
Govt of Pakistan appeals to International Partners for more loans after heavy losses inflected by enemy. Amid escalating war and stocks crash, we urge international partners to help de-escalate. Nation urged to remain steadfast. @WorldBank #IndiaPakistanWar #PakistanZindabad
— Economic Affairs Division, Government of Pakistan (@eadgop) May 9, 2025