BigTV English
Advertisement

Petrol Quality: పెట్రోల్ కల్తీ అని డౌటా? సింపుల్ గా ఇలా టెస్ట్ చేయండి!

Petrol Quality: పెట్రోల్ కల్తీ అని డౌటా? సింపుల్ గా ఇలా టెస్ట్ చేయండి!

Petrol Quality Check: పెట్రోల్ బంకులలో మోసాల గురించి తరచుగా వార్తలు చూస్తేనే ఉంటాం. కొలతల్లో తేడాలు ఉన్నాయని, కల్తీ చేస్తున్నారని వాహనదారులు ఆయా బంకుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల కల్తీ చేస్తున్నారని, మైలేజీ రావడం లేదని కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఫిర్యాదుల ఆధారంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తుంటారు. మోసాలు నిజమే అని తేలితే జరిమానా విధించడం, బంకులను మూసివేయడం, కొన్నిసార్లు జైలు శిక్ష విధించడం చేస్తుంటారు. ఇంతకీ అసలు పెట్రోల్ కల్తీ జరిగిందా? లేదా? అని చెక్ చేయడం ఎలా? బంకులో పెట్రోల్ క్వాలిటీ చెకింగ్ చేసుకునే హక్కు వాహనదారులకు ఉంటుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఫిల్టర్ పేపర్ తో క్వాలిటీ చెకింగ్

వినియోగదారుల చట్టం ప్రకారం బంక్ లో పెట్రోల్ క్వాలిటీ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే క్వాలిటీ చెక్ అనేది ప్రతి వినియోగదారుడి హక్కు. పెట్రోల్ క్వాలిటీని తెలుసుకునేందుకు సింపుల్ గా ఫిల్టర్ పేపర్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. వృత్తాకారంలో ఉన్న ఫిల్టర్ పేపర్ మీద రెండు మూడు చుక్కలు పెట్రోల్ వేయించాలి. కాసేపటి తర్వాత ఆ పేపర్ మీద వేసిన పెట్రోల్ ఆవిరి అవుతుంది. ఇప్పుడు పేపర్ స్వచ్ఛంగా కనిపిస్తే పెట్రోల్ క్వాలిటీగా ఉన్నట్లు అర్థం. అలా కాకుండా పేపర్ మీద మచ్చలు ఏర్పడితే పెట్రోల్ కల్తీ అయినట్లు గుర్తించాలి. ఒకవేళ ఫిల్టర్ పేపర్ లేకపోయినా, కాస్త మందంగా ఉండే తెల్లపేపర్ మీద కూడా ఈ పరీక్ష చేసుకోవచ్చు. ఒక రూపాయితో వైట్ పేపర్ కొనుగోలు చేసి కూడా క్వాలిటీ పరీక్ష జరపవచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమకు జరిగిన అన్యాయంపై బంక్ యజమాని నుంచి పరిహారం వసూళు చేసే అవకాశం ఉంటుంది.


స్వచ్ఛమైన పెట్రోల్ డెన్సిటీ ఎంత ఉండాలి?

సాధారణంగా పెట్రోల్ స్వచ్ఛతను డెన్సిటీలలో కొలుస్తారు. ఎలాంటి కల్తీ లేని పెట్రోల్ సాంద్రత 730 నుంచి 800 మధ్యలో ఉంటుంది. 800 కంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నట్లు చూపిస్తే, పెట్రోల్ కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ పోసే మిషన్ లో డెన్సిటీ కనిపించినప్పటికీ కచ్చితంగా నిజమే అని చెప్పలేం. పెట్రోల్ సాంత్రద తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరికరాల సాయంతో ప్రయోగశాలలో డెన్సిటీని చెక్ చేస్తారు. సో డెన్సిటీ చెక్ చేయడం ద్వారా పెట్రోల్ క్వాలిటీని చెక్ చేయడం అనేది పెద్ద రిస్కీ వ్యవహారం. సింఫుల్ గా ఫిల్టర్ పేపర్ ద్వారా టెస్ట్ చేసుకోవడం బెస్ట్. ఫిల్టర్ పేపర్ అనేది పెట్రోల్ బంకుల్లో ఇస్తారు. పెట్రోల్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నాం అంటే.. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని చట్టం చెప్తోంది. కాదు.. కూడదు అంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.  సో, ఇకపై మీకు అనుమానం కలిగితే ఫిల్టర్ పేపర్ సాయంతో క్వాలిటీ చెక్ చేసుకోండి.

Read Also: వేగంగా వెళ్తోన్న రైలుకు వేలాడుతూ ఓవర్ యాక్షన్.. తలుపు మూసుకోవడంతో..

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×