Operation Sindoor Updates: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరోవైపు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలను బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా గడిచిన రెండు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి బలగాలు. ఒకవిధంగా పెద్ద ముప్పు తప్పిందని అంటున్నారు.
చొరబాటుదారులకు ఝలక్ ఇచ్చిన బలగాలు
కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్, ఈసారి వార్ స్ట్రాటజీని మార్చింది. నేరుగా సైన్యంతో తలపడకుండా కేవలం సరిహద్దు గ్రామాల్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని కవ్వింపులకు పాల్పడుతోంది. దీనివల్ల భారత్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. దీన్ని గమనించిన భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి భారీగా మోహరించారు. ఆయా ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇరుదేశాల మధ్య సరిహద్దు ప్రాంతం ఫెన్సింగ్‌లో దాదాపు 80 శాతం పూర్తి చేసింది భారత్. ఇంకా కేవలం 20 శాతం మాత్రమే మిగిలివుంది. అక్కడ బీఎస్ఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. రాత్రివేళ పాక్ సైన్యం క్షిపణులను ఎక్కుపెడుతోంది. ఇంకోవైపు ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. గడిచిన రెండురోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సాంబ జిల్లాలో ఏడుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి బలగాలు. ఇదొక బిగ్ రిలీఫ్‌గా చెబుతున్నారు.
ఏడుగుర్ని మట్టుబెట్టిన బలగాలు
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో బోర్డర్ వెంబడి రోడ్లు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిత్యం రాకపోకలతో ఆయా రహదారులు నిత్యం బిజీగా ఉండేవి. మరోవైపు పర్యాటకులతో కళకళలాడేవి. ఇప్పుడు క్షిపణులు, తుపాకులు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాత్రి వేళ ఆప్రాంతాలకు ఎవరైనా వెళ్లినా బలగాలు మాత్రం రానివ్వడం లేదు.
ALSO READ: త్రిశూల వ్యూహం.. భారత్ అదుపులో పాక్ పైలట్లు
పఠాన్‌కోట్‌లో సెర్చ్ ఆపరేషన్
కేవలం జమ్మూకాశ్మీర్ మాత్రమే కాకుండా పంజాబ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. చంఢీఘర్, పంజాబ్‌లోని కీలక నగరాల్లో సైరన్ ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేసింది. సరిహద్దు ప్రాంతాలైన పటాన్‌కోట్ మొదలు, అమృతసర్, కపుర్తలా, అందపూర్, జలంధర్, లుధియానా, చండీఘర్, భటిండా వరకు భారీగా బలగాలు మోహరించాయి. పఠాన్‌కోట్‌లో పోలీసులు, ఆర్మీ కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. గతరాత్రి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది.
#WATCH | On 8-9 May 2025, BSF foiled a major infiltration bid at the International Boundary in Samba district, J&K by killing at least seven terrorists and causing extensive damage to the Pakistan Post Dhandhar, says BSF.
(Source: BSF) pic.twitter.com/c2MWOUuvQs
— ANI (@ANI) May 9, 2025