BigTV English

Besan For Skin: శనగపిండితో మృదువైన చర్మం మీ సొంతం !

Besan For Skin: శనగపిండితో మృదువైన చర్మం మీ సొంతం !

Besan For Skin: ప్రస్తుతం చర్మానికి సంబంధించి ప్రతి సమస్యకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కానీ నేటికీ చాలా మంది అమ్మమ్మల కాలం నాటి రెమెడీస్ వాడుతూ ఉన్నారు. ఇంట్లో ఉండే రకరకాల పదార్థాల వల్ల కూడా ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.


ప్రతి భారతీయ వంటగదిలో శనగపిండిని కచ్చితంగా ఉంటుంది. ఇది వంటలకే కాదు ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయెగపడుతుంది. ముఖానికి రకరకాల రసాయనాలు ఉన్న ఫేస్ ప్రొడక్ట్స్ వాడే బదులు శనగపిండి వాటడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శనగపిండి వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

శనగపిండితో ఫేస్ వాష్ నుంచి ఫేస్ ప్యాక్ వరకు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయన ఉత్పత్తులు లేకుండానే వాటితో చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. శనగపిండి చర్మానికి కాంతివంతంగా మార్చడమే కాకుండా చర్మానికి అనేక రకాలుగా మేలు కూడా చేస్తుంది. కాబట్టి శనగపిండిని తప్పకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగించాలి. మరి శనగపిండి ముఖానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
శనగపిండిలో ఉండే సహజ సిద్ధమైన క్లెంజర్లు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచేలా చేస్తాయి. ఫేస్ శుభ్రం చేయడానికి శనగపిండి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న అదనపు జిడ్డు, మురికిని తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

మచ్చలను తగ్గిస్తుంది:
శనగపిండిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మంపై వచ్చిన మచ్చల తెలగిపోతాయి. చర్మంపై మొటిమలు రాకుండా నివారిస్తాయి. అంతే కాకుండా శనగపిండి వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై త్వరగా వృద్ధాప్య చాయలు రాకుండా చేస్తుంది. ఎప్పుడూ ముఖాన్ని తాజాగా ఉంచడంలో శనగపిండి ఎంతో ఉపయోగపడుతుంది.

టాన్ తగ్గుతుంది:

రెగ్యులర్ గా శనగపిండి ముఖానికి ఉపయోగించడం వల్ల టాన్ తగ్గుతుంది, చ ర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది .చర్మం మెరుస్తూ ఉండటానికి శనగపిండి ఉపయోగపడుతుంది. టాన్ తొలగించడానికి పెరుగు, పాలు శనగపిండిలో కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత దీనిని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. చర్మాన్ని ఇది తీమగా ఉంచుతుంది. సహజమైన చర్మం మెరుపును శనగపిండి అందిస్తుంది.

Also Read: ఇలా చేస్తే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది

డెడ్ స్కిన్ తొలగిస్తుంది:

శనగపిండిని ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం మృదువుగా మారుతుంది. శనగపిండిని ముఖానికి తరుచుగా వాడటం వల్ల చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. అంతే కాకుండా కాంతి వంతగా మెరుస్తూ కనిపిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చర్మాన్ని శనగపిండి వాడటం వల్ల మెరిసేలా చేసుకోవచ్చు. తరుచుగా ముఖానికి శనగపిండిని వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×