E-Paper
Advertisement

రోబోటిక్ గింబల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ లాంచ్.. ఇక ట్రైపాడ్ అక్కర్లేదు, ధరెంతంటే?

రోబోటిక్ గింబల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ లాంచ్.. ఇక ట్రైపాడ్ అక్కర్లేదు, ధరెంతంటే?
Advertisement

Honor Robot Phone: నేటి ఆధునిక యుగంలో.. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రోజూ కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి ప్రముఖ టెక్ సంస్థ హానర్.. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే Honor Robot Phone. సాధారణంగా ఫోన్‌లకు స్టాండ్ లేదా ట్రిపోడ్ పెట్టి వీడియోలు తీస్తుంటాం. కానీ ఈ ఫోన్‌కు ఇక వాటితో పనిలేదు.

కెమెరాలోనే అసలైన మ్యాజిక్..

ఈ Honor Robot Phoneలో అత్యంత ప్రత్యేకమైనది దీని టాప్ భాగంలో ఉండే రోబోటిక్ గింబల్ కెమెరా. ఇది అవసరమైనప్పుడు బయటకు వచ్చి, మన కదలికలను బట్టి అటూ ఇటూ తిరుగుతుంది. దీనిలో 200MP మెయిన్ కెమెరా, మరో 200MP జూమ్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను అమర్చారు. అలాగే వీడియోస్ తీసేటప్పుడు మనల్ని నిరంతరం ఫ్రేమ్‌లో ఉంచేలా ఏఐ సాంకేతికత ఈ ఫోన్‌లో ఉంది. ప్రముఖ కెమెరా సంస్థ ‘ఏఆర్‌ఆర్‌ఐ’ భాగస్వామ్యంతో దీనిని రూపుదిద్దారు.

Advertisement

Also Read: కూల్ లుక్స్, టెన్సర్ G6 పవర్.. Pixel 11 Seriesలో ఇన్ని ప్రత్యేకతలా?

గేమర్స్‌కు పండగే:

చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ Honor Robot Phone డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదు. 6.31 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించేలా అత్యధిక బ్రైట్‌నెస్ ఇస్తుంది. గేమింగ్, ఇతర పనుల కోసం ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వాడారు. దీంతో ఎంతటి పెద్ద యాప్‌లైనా, గేమ్‌లైనా స్మూత్‌గా పనిచేస్తాయి.

ఛార్జింగ్ టెన్షన్ లేని బ్యాటరీ:

Advertisement

చాలాసేపు వీడియోలు తీసినా లేదా గేమ్‌లు ఆడినా బ్యాటరీ అయిపోతుందనే భయం అక్కర్లేదు. Honor Robot Phoneలో భారీ 7,060mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు 120W వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి క్షణాల్లో ఫోన్ పూర్తి ఛార్జ్ అయిపోతుంది.

ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేశారు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.1,41,000గా ఉంది. ఇక టాప్ ఎండ్ 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.1,83,000 వరకు ఉంది. త్వరలోనే ఇది ఇతర దేశాల మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఆరోగ్యంపై గూగుల్ స్పెషల్ ఫోకస్.. Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ మ్యాజిక్!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×