BigTV English

Israel Apology: తప్పు ఒప్పుకుని.. ఇండియాకు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్.. అసలు ఏమైంది?

Israel Apology: తప్పు ఒప్పుకుని.. ఇండియాకు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్.. అసలు ఏమైంది?

ఇజ్రాయెల్ దేశం ఇండియాకు క్షమాపణ చెప్పింది. ఇజ్రాయెల్ చేసింది తప్పే, అయితే ఆ తప్పు ఇంకా జనంలోకి రాలేదు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది, భారత ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించలేదు. అంతలోనే ఇజ్రాయెల్ తన తప్పు తెలుసుకుంది, వెంటనే సారీ చెప్పింది. భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడమే కాదు, భారత్ తో శత్రుత్వం పెంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసినట్టయింది.


అసలింతకీ ఆ తప్పేంటి..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రెయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ క్షిపణుల పరిధిని వివరించే మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను నేపాల్‌లో భాగంగా చిత్రీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. భారత్ కి చెందిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఇజ్రాయెల్ తప్పుని గుర్తించి విమర్శలు చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీ ఘాటుగా స్పందించింది. భారత్ విదేశాంగ విధానంలో ఎందుకు మధ్యేమార్గాన్ని అవలంబిస్తుందనే విషయం ఇప్పటికైనా అర్థమైందా అని IDFకు సమాధానమిచ్చింది. విదేశాంగ విధానంలో ఎవరూ ఎవరికి మిత్రులు కారు అనే అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చింది. దీంతో భారత్ ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ కి అర్థమైంది. వెంటనే IDF తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది.

మ్యాప్ తో గందరగోళం..
ఇరాన్ తర్వాత ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, భారత్, చైనా.. ఇలా వివిధ దేశాలు ఉన్నట్టుగా IDF ఒక మ్యాప్ విడుదల చేసింది. అయితే ఆ మ్యాప్ లో భారత్ లోని జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లోకి వచ్చేట్టుగా చిత్రీకరించారు. ఇక నేపాల్ తో మన ఈశాన్య రాష్ట్రాలను కలిపేశారు. దీంతో వివాదం చెలరేగగా.. ఆ మ్యాప్ కచ్చితమైన జాతీయ సరిహద్దులను సూచించేది కాదంటూ IDF వివరణ ఇచ్చింది.

ఇరాన్ క్షిపణి పరిధిలో 15 దేశాలు
ఇరాన్ ప్రపంచ ముప్పు అని పేర్కొంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వారి అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత ప్రపంచాన్ని కబళించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని చెప్పింది. ఇది ఆరంభం మాత్రమేనని, ఆ తర్వాత ఇతర దేశాలపైకి కూడా దాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మ్యాప్ ద్వారా వివరించింది. ఇరాన్ ఆయుధాల పరిధిలోకి ఏయే దేశాలు వస్తాయో ఈ మ్యాప్ లో చూపించారు. ఇరాన్ క్షిపణి పరిధిలో భారతదేశం కూడా ఉందని మ్యాప్‌లో చేర్చారు. ఆ మ్యాప్ ప్రకారం భారత్ సహా 15 దేశాలు ఇరానియన్ క్షిపణుల పరిధిలోకి వస్తాయి. అందుకే ముందుగా తాము ఇరాన్ పై తిరుగుబాటు చేస్తున్నామని, తమతోపాటు ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వచ్చే అన్ని దేశాలు అలర్ట్ గా ఉండాలనే సందేశాన్నిచ్చింది ఇజ్రాయెల్ సైన్యం. మొత్తమ్మీద తప్పుడు మ్యాప్ తో మరిన్ని ఇబ్బందులు రాకముందే ఇజ్రాయెల్ తమ తప్పు ఒప్పుకుని సారీ చెప్పడం ఇక్కడ విశేషం.

ఇక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం విషయానికి వస్తే.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. టెహ్రాన్‌పై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో అనేక మంది ఇరానియన్ సైనిక కమాండర్లు మరణించారు. కీలకమైన స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. జెరూసలేం సహా ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ లతో దాడులు చేసింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ యుద్ధంతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×