Israel Psychological Warfare| దాదాపు 14 నెలలుగా పాలస్తీనా భూభాగమైన గాజాలో ఇజ్రాయెల్ అరాచకం సృష్టిస్తోంది. పేరుకి హమాస్ తో చేస్తున్న యుద్దంలో ఇప్పటివరకు 45000 మందికి పైగా అమాయక ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసింది. గాజాలోని 360 చదరుపు కిలోమిటర్ల భూమిపై ఉన్న దాదాపు అన్ని భవానాలు నేలమట్టం అయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాల కోసం తరలి వెళుతున్నారు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కానీ అక్కడ కూడా ఇజ్రాయెల్ సైన్యం ఏదో ఒక సాకుతో బాంబులు కురిపిస్తోంది.
అమాయక పౌరులు ఆకలితో అల్లాడుతుంటే వారికి ఇతర దేశాల నుంచి వచ్చే సాయం కూడా అందకుండా చేస్తోంది. ఐక్యరాజ్య సమితి తరపున మానవ హక్కుల కార్యకర్తలు యుద్ధ బాధితులకు సేవ చేయడానికి వెళితే.. వారిని కూడా కాల్చి చంపేస్తోంది. ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి గాజాలో సమాజ సేవ కార్యకర్తలుగా వెళ్లినవారిలో అధికారిక గణాంకాల ప్రకారం.. 200 మంది చనిపోయారు. ఇదేంటని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తే.. చనిపోయిన వారందరూ మిలిటెంట్లు లేకపోతే హమాస్ కు మద్దతుదారులు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం. పొరపాటున జరిగిపోయిందని సమర్థించుకోవడం ఇజ్రాయెల్ కు అలవాటుగా మారిపోయింది.
ఒకవైపు హమాస్ నాయకులందరూ చనిపోయారు. ఇక యుద్ధం ముగింపు దశకు చేరుకుందని చెబుతూనే ప్రతిరోజు పదులు, వందల సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం నరమేధం చేస్తోంది. హమాస్ మిలిటెంట్లు చాలాకాలంగా బందీలను విడుదల చేస్తాం.. కాల్పుల విరమణకు తాము రెడీ అని చెప్పినా.. ఇజ్రాయెల్ ప్రభుత్వం బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదలను ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంత ఇజ్రాయెల్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు.
Also Read: కాల్పుల విరమణ తూచ్.. లెబనాన్‌పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్!
అయితే ఇజ్రాయెల్ సిరియా, లెబనాన్ లో కూడా విజయవంతంగా విధ్వంసం సృష్టింస్తోంది. ఇదంతా ఇజ్రాయెల్‌కు ఎలా సాధ్యమని యూరోప్ మానవ హక్కుల సంస్థలు సర్వే చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శత్రు భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసే సమయంలో డ్రోన్లలో పసికందుల ఏడ్పులు, మహిళల ఆర్తనాధాలు రికార్డ్ చేసి స్పీకర్లు టార్గెట్ ప్రాంతాల్లో విసిరేయడం.. ఆ ఏడుపు ధ్వనులు విని ఎవరైనా భవనాల నుంచి బయటకు రాగానే వారిపై కాల్పులు చేయడం.. ఇజ్రాయెల్ సైనికులు ఇలాంటి ప్రణాళికలతో శత్రువులను మానసికంగా దెబ్బతీసి.. ఆ తరువాత వారిని అంతం చేస్తారని యూరో మెడ్ మానిటర్ అనే మానవ హక్కుల సంస్థ సర్వేలో తేలింది.
హెబ్రూ, అరబిక్ భాషల్లో ధ్వనులను రికార్డ్ చేసిన స్పీకర్లు టార్గెట్ ప్రాంతాల్లో విసరగానే సామాన్య పౌరులు సాయం చేయడానికి బయటికి రాగానే ఆకాశంలో ఎగిరే డ్రొన్లు.. బుల్లెట్లు, బాంబులు కురిపిస్తాయని సర్వే రిపోర్ట్ లో యూరో మెడ్ మానిటర్ పేర్కొంది. దీంతో పాటు డ్రోన్లు సోనిక సౌండ్లు ప్రయోగిస్తుందని.. దీని వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వినికిడి శక్తి కోల్పోయారని.. గాజు భవనాలు పగిలిపోయాయని తెలిపింది.
పైకి ఇజ్రాయెల్ సంధి గురించి మాట్లాడుతున్నా.. దాని లక్ష్యం గాజా భూమిని ఆక్రమించుకోవడం కోసం అక్కడి నుంచి మొత్తం పాలస్తీనా వాసులను తరిమికొట్టడం లేదా అంతం చేయడమేనని జియోపాలిటిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.