Naga Chaitanya-Sobhita Wedding: హిందూ సంప్రదాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ పెళ్లిలో చేసే ప్రతి పని వెనుక ఒక అర్ధం ఉంటుంది. కట్టు, బొట్టు, అలంకరణ, వధూవరులతో పూజా చేయించడం, పెళ్లి తరువాత తలంబ్రాలు పోయించడం, ఏడడుగులు, పాల బిందెలో ఉంగరాలు వేసి తీయించడం.. ఇలాంటివన్నీ వధూవరులకు ఎంత ఆనందాన్ని అందిస్తాయో.. చూసేవారికి కన్నుల పంటగా అనిపిస్తుంది. ఇక అక్కినేని వారి పెళ్లి సందడి కూడా అభిమానులకు కన్నులపంటగానే కనిపిస్తుంది.
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, హీరో అక్కినేని నాగ చైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. జోష్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన చై.. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ సినిమాలో తనతో పాటు రొమాన్స్ చేసిన హీరోయిన్ సమంతను ప్రేమించి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సామ్ – చై మధ్య విభేదాలు తలెత్తడంతో నాలుగేళ్లు కూడా నిండకుండానే వారు విడాకులు తీసుకొని విడిపోయారు.
Keerthy Suresh : పెళ్ళి కోసం గోవాకు చేరుకున్న కీర్తి, ఆంటోనీ జంట… హింట్ ఇచ్చిన హీరోయిన్
ఇక చై తన విడాకుల అనంతరం శోభితాతో ప్రేమలో పడ్డాడు. రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహాబంధంతో ఒక్కట్టయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి ఫోటో, ప్రతి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తెలుగుదనం ఉట్టిపడేలా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ అతిరథ మహారధులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.
చై – శోభితా పెళ్లి వీడియోలు కొన్ని రెండు రోజుల నుంచి వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే చై.. శోభితా మెడలో మూడు ముళ్లు వేసేటప్పుడు.. అఖిల్ వెనుక నుంచి ఈలలు వేయడం.. దగ్గుబాటి కజిన్స్ అరవడం.. శోభితా కంటతడి పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్న సంతోషం చూసి తమ్ముడు అలా రియాక్ట్ అవ్వడం చూసి అక్కినేని ఫ్యాన్స్ అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలని కామెంట్స్ పెట్టారు.
Rashmika Mandanna: కాబోయే అత్తగారి కుటుంబంతో కలిసి పుష్ప 2 చూసిన శ్రీవల్లీ..
ఇక ఈ వీడియోతో పాటు చై-శోభితా ల వివాహా వేడుక నుంచి మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్లిలో చై- శోభితా పాల బిందెలో ఉంగరాలట ఆడారు. తలంబ్రాల వేడుక ముగిసాక.. ఈ ఉంగరాలట మొదలయ్యింది. ఒక బిందెలో నిండా పాలు పోసి అందులో ఒక ఉంగరాన్ని వేస్తారు. వధూవరులు ఇద్దరు ఆ బిందెలో చేతులు పెట్టి.. ఆ ఉంగరాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఆ ఉంగరాన్ని చేజిక్కించుకుంటారో వారే విజేత. ఇక ఈ ఉంగరాలటలో వరుడు చైతన్య.. వధువు శోభితాను ఓడించి ఉంగరాన్ని అందుకొని విన్నర్ గా నిలిచాడు.
Pushpa 2 : థియేటర్లో మిస్టీరియస్ స్ప్రేతో ఆడియన్స్ కు వాంతులు… ఆగిపోయిన షో
అసలు ఈ ఉంగరాలట వెనుక ఉన్న కథ ఏంటి.. ? అంటే దేవలోకంలో విష్ణుమూర్తి- లక్ష్మీ దేవి తమ పెళ్లి తరువాత ఈ ఆటను ఆడారని పురాణాల్లో రాసి ఉంది. దీనివలన వధూవరుల మధ్య ఉన్న భయం, బెరుకు పోయి.. ఒకరినొకరు అర్ధం చేసుకుంటారని పెద్దలు చెప్తారు. అంతేకుండా ఎవరైతే ఉంగరం తీసుకొని విజేతగా నిలుస్తారో వారిదే పై చేయిగా నిలుస్తుందని కూడా చెప్పుకొస్తారు. ఆ లెక్కన చైతన్య- శోభితా లైఫ్ లో చైదే అప్పర్ హ్యాండ్ గా ఉంటుందని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
#Watch: Who gets the ring first?🤪#NagaChaitanyaSobhitawedding #SoChayWedding #SoChay #SobhitaDhulipala #ChaySo pic.twitter.com/71rCjqoRNm
— Pune Times (@PuneTimesOnline) December 6, 2024