BigTV English

Israel Bomb Hezbollah: దారుణమైన చావు.. హిజ్బుల్లా చీఫ్ హత్యకు 900 కేజీ అమెరికా బాంబు ఉపయోగించిన ఇజ్రాయెల్..

Israel Bomb Hezbollah: దారుణమైన చావు.. హిజ్బుల్లా చీఫ్ హత్యకు 900 కేజీ అమెరికా బాంబు ఉపయోగించిన ఇజ్రాయెల్..

Israel Bomb Hezbollah| హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ హత్య చేసింది. అయితే ఇదంతా అమెరికా సహాయంతోనే జరిగిందని ఒక అమెరికన్ సెనేటర్ వెల్లడించారు. నస్రల్లాను హత్య చేయడానికి ఇజ్రాయెల్ అమెరికన్ బాంబులు ఉపయోగించినట్లు అమెరికన్ సెనేటర్ మార్క్ కెల్లీ తెలిపారు.


అమెరికా సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ ఎయిర్‌ల్యాండ్ సబ్ కమిటీ చైర్మన్ అయిన సెనేటర్ మార్క్ కెల్లీ.. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ”హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై బాంబు దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ‌కు మేము (అమెరికా) 900 కేజీల మార్క్ 84 సిరీస్ బాంబులు వారం రోజుల క్రితమే సరఫరా చేశాము. ఇవి బంకర్లను సైతం పేల్చేయగలవు. అందుకే వీటికి బంకర్ బస్టర్స్ అని కూడా పిలుస్తారు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ బాంబుల దాడిలోనే చనిపోయాడు. ఇలాంటి బాంబులతో పాటు జెడిఎఎమ్ బాంబులు కూడా ఇంకా సరఫరా చేస్తాము. జెడిఎఎమ్ బాంబులు సాధారణంగా అన్‌గైడెడ్ బాంబులు అయితే వీటికి జిపిఎస్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా గైడెడ్ బాంబులుగా మార్చగలం.” అని సెనేటర్ వివరించారు.

Also Read: బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..


ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా నుంచే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. అక్టోబర్ 7, 2023 లో హమాస్ దాడి తరువాత యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా అన్ని విధాల ఆయుధ, ఆర్థిక సాయం ఇజ్రాయెల్ కు అందిస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్ చేసే దాడుల గురించి అమెరికాకు ముందుగానే సమాచారం ఉంటుంది. కానీ హసన్ నస్రల్లా హత్య గురించి ఇజ్రాయెల్.. చివరి క్షణం వరకు ఈ విషయం బయటికి రానివ్వలేదు. అయినా హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయటుదేరిన మరుక్షణమే ఈ వార్త అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరకు చేరిందని ‘ది గార్డియన్’ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

వారం రోజుల్లో ఏడుగురు హిజ్బుల్లా కమాండర్లు మృతి
హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతవారం రోజుల్లో దాడులు తీవ్రం చేసింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు హిజ్బుల్లా కమాండర్లు మృతి చెందారు. హసన్ నస్రల్లా చనిపోయిన మరుసటి రోజే హిజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ అయిన నబీల్ కౌక్ కూడా మరిణించాడని స్వయంగా హిజ్బుల్లా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. మరో సీనియర్ కమాండర్ అలి కరాకీ కూడా అదే దాడిలో తీవ్ర గాయాల కారణంగా చనిపోయాడు.

ఇబ్రాహీమ్ అకీల్, అహ్మద్ వెహ్బె, మొహమ్మద్ సురూర్, ఇజ్రహీమ్ కొబెసిసి అనే ఇతర కమాండర్లు కూడా ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల్లో చనిపోయారు.

మరోవైపు ఒక్క ఆదివారం రోజే లెబనాన్ పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల ధాటికి 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఈ దాడుల్లో 105 మంది చనిపోగా, 359 గాయపడ్డారని లెబనాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×