E-Paper
Advertisement

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..
Advertisement

PM Benjamin: వందల మంది ప్రయాణికులను రక్షించిన ప్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనతో నేరుగా దేశాధి నేతలు వీడియో కాల్స్ చేసి మాట్లాడారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడగా, ఇప్పుడు ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యూహు వంతైంది. రేపో మాపో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను సందర్శించమని స్మిత్‌ను ఆహ్వానించారు పీఎం బెంజిమన్. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం సంబరాల జ్యోతిని వెలిగించడానికి మిమ్మల్ని, నా మిత్రుడు ప్రధాని మోదీని ఆహ్వానించాలనుకుంటున్నానని తెలిపారు.

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శనివారం సాయంత్రం ఫ్లై దుబాయ్ విమాన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో వీడియో కాల్ చేసి మాట్లాడారు. కెప్టెన్‌ మచ్చర్‌ను ఇజ్రాయెల్-భారత్ కాకుండా యావత్ ప్రపంచానికి హీరోగా ప్రధాని కొనియాడారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతిని వెలిగించాలని పైలట్ మచ్చర్‌ను ఆహ్వానించారు. విమానంలో జరిగిన భావోద్వేగం, కాక్‌పిట్‌లో జరిగిన భయానక క్షణం గురించి కొత్త వివరాలు బయటపెట్టారు.

డోర్ ఓపెన్ చేసే క్షణాల గురించి కొత్త విషయాలు

Advertisement

సంభాషణ సందర్భంగా ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు.. కెప్టెన్‌తో ఈ విధంగా మాట్లాడారు. దానికి ప్రతిస్పందనగా కాక్‌పిట్‌లోని ఆ భయానక క్షణాల గురించి కొత్త వివరాలు తెలిపారు కెప్టెన్ మచ్చర్. కో-పైలట్ ప్రార్థన చేయడానికి లేచి నిలబడ్డాడని వివరించారు. అందుకు గౌరవ సూచకంగా తాను వెనక్కి తిరిగి చూడలేదని వివరించారు. కొన్ని నిమిషాల తర్వాత తనకు వెనుక ఏదో బలంగా ఢీ కొన్నట్లుగా ఓ కుదుపు మాదిరిగా వచ్చిందన్నారు.

విమానానికి ఏదో జరిగిందని అనుకున్నానని, కానీ మళ్ళీ ఆ విధంగా జరిగినప్పుడు కో-పైలట్ అని నేను గ్రహించానని తెలిపాడు. కెప్టెన్ మచ్చర్ చెప్పిన మాటల వివరాల ప్రకారం.. నేను అతడ్ని ఆపడానికి ప్రయత్నించానని, నాకు ఏమీ కనిపించలేదన్నారు. అంతా అస్పష్టంగా ఉందని, ఆ సమయంలో విమానం వేగంగా కిందకి దిగిపోవడాన్ని గమనించానని వివరించారు. ఒకసారి కాక్‌పిట్ తలుపు తెరిచానని, దాన్ని కో-పైలట్  మూసి వేశాడని తెలిపారు.

Advertisement

ALSO READ: ‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఆ సమయంలో తాను నేల మీద పడిపోయానని, తనకు మరో అవకాశం ఉందని గ్రహించానని ఆ భయానక క్షణాల గురించి వివరించారు. నేను మళ్ళీ తలుపు తెరిచానని, ఈసారి తనపైకి దూసుకు రావడం, బయట కొంతమంది ప్రయాణికులు నిలబడి ఎదురుచూసి అరవడం మొదలుపెట్టారని తెలిపారు. ఈ సంభాషణ గురించి చెప్పిన కెప్టెన్, తన జీవితంలో ఇది భావోద్వేగ భరితమని తెలిపారు.

 

Related News

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

ఇది జిహాదీ ఉగ్రదాడే.. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి వార్నింగ్!

ఫ్లై దుబాయి విమానంలో ఏం జరిగింది? ఘటన తర్వాత, విమానంలో చికిత్స చేసిన ఓ డెంటిస్ట్

Big Stories

Advertisement
×