Sherfane Rutherford catch controversy in 3rd ODI vs India: టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) మధ్య నిన్న మూడవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ బిగ్ విక్టరీ అందుకుంది. న్యూ చండీగఢ్ (PCA International Cricket Stadium, Ground A, New Chandigarh) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (Sherfane Rutherford) వికెట్ పై కాంట్రవర్సీ రాజుకుంది. నమన్ ధీర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి విండీస్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ పెవిలియన్ కు వెళ్లాడు.
అయితే, బ్యాట్ కు బంతి తగలకుండా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్ కు వెళ్తూ బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. బౌండరీ రోప్ ను కూడా కాలుతో తన్నిమరీ వెళ్లిపోయాడు. అటు ఈ సంఘటనపై ఆకాశ్ చోప్రా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంపైర్లు నిద్రపోతున్నారా? అల్ట్రా ఎడ్జ్ సిస్టం పని చేస్తుందా ? అసలు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఔటే కాదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ క్యాచ్ వివాదం హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడవ వన్డే నిన్న న్యూ చండీగఢ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించినప్పటికీ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ క్యాచ్ పై వివాదం రాజుకుంది. 24 పరుగులు సాధించిన షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, నమన్ ధీర్ బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే బ్యాట్ కు బంతి తగలకున్నా, అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకోగా… అల్ట్రా ఎడ్జ్ లో మాత్రం బ్యాట్ కు బంతి తగిలినట్లు కనిపించింది.. కానీ రిప్లై లో బ్యాట్, బంతికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. దీంతో టీమిండియా క్రికెటర్లు కూడా షాక్ అయ్యారు. అల్ట్రా ఎడ్జ్ ప్రకారం అంపైర్ కూడా ఔట్ అని ప్రకటించడంతో..షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా చోటు చేసుకున్న షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ క్యాచ్ వివాదంపై ఆకాశ్ చోప్రా స్పందించారు. అసలు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఔటే కాదని వ్యాఖ్యానించారు. బ్యాట్ కు బంతి తగలకుండానే ఎలా ఔట్ ఇస్తారని నిలదీశారు. అసలు ఇండియాలో ఆల్ట్రా ఎడ్జ్ సిస్టం పనిచేస్తుందా? అని అసహనం వ్యక్తం చేశారు.
🔴 SHERFANE RUTHERFORD ANGRY OVER UMPIRE'S DECISION 🤯
– It was clearly not out, so why did the umpire give such a poor decision? 🤦 pic.twitter.com/Vfni8eAGKi
— Sam (@cricsam02) October 4, 2026