BigTV English

Japan new Law: జపాన్‌, నవ్వడం కోసం కొత్త చట్టం..

Japan new Law: జపాన్‌, నవ్వడం కోసం కొత్త చట్టం..

Japan new Law(Latest international news today): నవ్వడం ఒక యోగం.. నవ్వించడం భోగం.. నవ్వలేకపోవడం రోగమన్నారు పెద్దలు. ఈ సామెత అర్థాన్ని జపాన్ చక్కగా అర్థం చేసుకుంది. దీనికోసం ఏకంగా చట్టాన్ని తెచ్చింది. అవును ముమ్మాటికీ నిజం. లాఫింగ్ కోసం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇంతకీ కారణాలు తెలుసుకునే ముందు ఇంకా లోతుల్లోకి వెళ్తే..


జపాన్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం జపాన్‌వాసులు రోజుకు ఒక్క సారైనా నవ్వాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవని అంటోంది. తక్కువగా నవ్వేవారిలో కొంతమంది రకరకాల వ్యాధులతో మరణిస్తున్నట్లు యమగల యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో చట్టం తీసుకొచ్చిందట.

పని ప్రదేశంలో నవ్వుతూ కూడిన వాతావరణాన్ని ప్రొత్సాహించాలంటూ ఆదేశంలోని కంపెనీలను ఆదేశించింది. అంతేకాదు ప్రతీనెలా దీనికోసం ఓ రోజును కేటాయించాలని ఆలోచన చేస్తోంది. ఆగష్టు ఎనిమిదైతే బాగుంటుందని, 8/8 కలిసి వస్తుందని అంటోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ALSO READ: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

నవ్వడం, నవ్వకపోవడమనేది ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, ఇలాంటి చట్టం వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈ విషయంలో ప్రజల హక్కులను కాలరాయ వద్దని సూచన చేసింది.

ఈ వాదనను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. ప్రజలపై బలవంతంగా రుద్దలేదని, దీన్ని పాటించాలా లేదా అనేది వారికే వదిలి వేస్తున్నట్లు పేర్కొంది. వారి ఆరోగ్యానికి సంబంధించినదని చట్టంలో జరిమానా లాంటివి పొందుపరచలేదని గుర్తు చేసింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×