EPAPER

Bhadrachalam encounter: భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter:  భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ‌పాలెం ప్రాంత సమీపంలో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది.


ఓ వైపు ఎన్‌కౌంటర్లు.. మరోవైపు కూంబింగ్‌తో మావోలను హడలెత్తిస్తున్నారు పోలీసు బలగాలు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా  ఆదిలోనే వారికి ఊహించని ఎదురు‌దెబ్బ తగిలింది.

ALSO READ: ఉమ్మడి ఆదిలాబాద్.. జైనూరులో అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు.. అసలేం జరిగింది?


ఏజెన్సీల్లో పార్టీ విస్తరణ కోసం గ్రూపులుగా ఏర్పడ్డారు మావోయిస్టులు. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భద్రాచలం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకున్నారు. దీనిపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో కూంబింగ్ మొదలుపెట్టారు.

కరకగూడెం అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్నతోపాటు అదే దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.

రఘునాథపాలెం ఏరియాలో ఈ దళం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మావోయిస్టులకు వరుసగా కోలుకోని దెబ్బలు తగులుతున్నాయి. రెండురోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెల్సిందే.

Related News

Hydra police: మరింత పటిష్టంగా హైడ్రా.. ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది..

Medical Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

New Medical Colleges: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

Chakali Ailamma: బ్రేకింగ్ న్యూస్.. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

×