Korowai: ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు-విశేషాలు ఎన్నో ఉంటాయి. జంతువులు, నదులు ఇలా ఏది తీసుకున్నా సరే. అంతెందుకు మనషుల మాదిరిగా ఉంటారు. మానవులతో అస్సలు సంబంధాలు ఉండవు. రాతి యుగం నాటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఇప్పటికీ ఉన్నారు. వారంతా చెట్లపై నివాసం ఉంటారు. ఈ విషయం నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ. ఇండోనేషియాలోని కొరోవాయి ప్రజల వాస్తవ రూపం.
ఈ ప్రపంచంలో నేల మీద నివసించని ప్రజలు ఉన్నారు. భూమికి 40 మీటర్ల ఎత్తులో చెట్ల మధ్య ఇళ్లు నిర్మించుకుంటారు. రాతియుగం నాటి సంప్రదాయాలను పాటిస్తారు. వారంతా ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఇండోనేషియాలోని పాపువా దట్టమైన అడవుల్లో ఆ తెగ నివాసం ఉంటోంది. వారి జీవితమంతా చెట్లపై ఇళ్లను నిర్మించుకుంటూ జీవనం గడుపుతారు.
ఇండోనేషియాలోని పాపువాలోని దట్టమైన అడవుల్లో వారిని కొరోవాయి తెగ అని పిలుస్తారు. అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. వారి అత్యంత ప్రత్యేకమైన లక్షణం ఒక్కటే. నేలపై ఇళ్ళు కట్టరు. భూమి నుంచి 20 నుంచి 40 మీటర్లు ఎత్తులో చెట్లపై గడ్డి ఇళ్లు నిర్మించుకుంటారు. కుటుంబాలు అంతా చెట్లపైనే నివాసం ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఇదే జీవనం వారంతా కొనసాగిస్తు్న్నారు. చెట్ల నివాసులు లేదా చెట్ల ప్రజలు అని పిలువబడే కొరోవాయి తెగ, పాపువా ప్రాంతం ఆదిమవాసుల తెగల్లో ఒకటి.
ప్రత్యేకమైన జీవనశైలి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆధునిక మానవులకు దూరంగా ఉంటూ అందమైన చెట్ల ఇళ్లను నిర్మిస్తారు. రాతి యుగంలో మానవులు జీవించినట్లే ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా దట్టమైన అడవులలో నివాసం ఉంటున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, ఇతర సహజ వనరులను సేకరించడంపై వారి జీవనం ఆధారపడి ఉంటుంది. పురుషులు ఆహారాన్ని వేటాడి సేకరించగా, స్త్రీలు ఇంటి పనులు, పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటారు.
వేల సంవత్సరాల పురాతన సంప్రదాయాలు, ఆచారాలు ఇప్పటికీ ఆ తెగలో కొనసాగుతున్నాయి. పాములు, అడవి జంతువుల నుండి రక్షణ పొందడం మొదలు, దుష్టశక్తులు నేలపై నివసిస్తాయనేది ఆ తెగ బలమైన నమ్మకం. ఈ సమాజం దుష్టశక్తుల పట్ల అత్యంత సున్నితంగా ఉంటుందని, అందుకే వారిలో నరమాంస భక్షణకు సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయట. అడవిలో లభించే కలప, వెదురు, సగో తాటి ఆకులు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి ఇళ్లను నిర్మించుకుంటారు. చెట్లపై నిర్మాణాలను నిర్మించడంలో వారు అసాధారణమైన నైపుణ్యం కలిగి ఉంటారు.
ALSO READ: నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్
కొరోవాయి తెగ జనాభా సుమారు 3,000 మంది ఉంటుందని అంచనా. 1970ల చివరి వరకు బయటి ప్రపంచంతో దాదాపుగా ఎలాంటి సంబంధం లేవు. తమతో పాటు ఇతర ప్రజలు ఉన్నారనే విషయం కూడా వారికి తెలియదు. పందులు, పక్షుల వంటి జంతువులను వేటాడుతారు. అడవి నుండి పండ్లు, గింజలు, తేనె, కీటకాలను సేకరిస్తారు. సాధారణంగా చెట్టు ఇల్లు ఆరు నుండి ఎనిమిది మంది సభ్యులున్న ఒక కుటుంబానికి సరిపోతుంది. ఆ ఇల్లు రెండు లేదా మూడు గదులుగా విభజిస్తారు. ప్రతి గదిలో పొయ్యి ఉంటుంది. పురుషులు, స్త్రీలు వేర్వేరుగా నిద్రపోతారు. ఆ ఇంట్లో ఆహారం, సామాను నిల్వ చేసుకోవడానికి ఒక ప్రదేశం కూడా ఉంటుంది.