E-Paper
Advertisement

No visa for Malaysia : వీసా లేకుండానే మలేషియాకు.. భారతీయులకు గుడ్ న్యూస్

No visa for Malaysia : మలేషియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటక రంగాన్ని, పెట్టుబడులను ప్రొత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశియులు ముఖ్యంగా.. భారత్‌, చైనా నుంచి తమ దేశానికి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే రావడానికి అనుమతి ఇచ్చింది

No visa for Malaysia : వీసా లేకుండానే మలేషియాకు.. భారతీయులకు గుడ్ న్యూస్
Advertisement

No visa for Malaysia : మలేషియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటక రంగాన్ని, పెట్టుబడులను ప్రొత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశియులు ముఖ్యంగా.. భారత్‌, చైనా నుంచి తమ దేశానికి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే రావడానికి అనుమతి ఇచ్చింది. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్‌ ఇబ్రహీం ఈ విషయాన్ని ఆదివారం ఓ సమావేశంలో వెల్లడించారు.

మలేషియా ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలంటే పర్యాటక రంగ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. ఇందుకోసం ముందుగా భారత్, చైనా‌ పౌరులకు తమ దేశంలో పర్యటించేందుకు వీసా అవసరం లేకుండానే అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

డిసెంబర్‌ 1, 2023 నుంచి భారత్, చైనా పౌరులకు ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ అనుమతి కేవలం 30 రోజులపాటు ఉంటుంది. రెండు దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు, పర్యాటకులను ప్రోత్సహించేందుకు వీసా అనుమతులు సులభతరం చేస్తామని గత నెలలోనే మలేషియా ప్రధాని ప్రకటించారు.

మలేషియా లాగే ఇటీవలే థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు భారతీయులకు తమ దేశం రావడానికి వీసా అవసరం లేదని చెప్పాయి.

Advertisement

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×