New Study On Cigarette: సిగరెట్లు వ్యక్తుల జీవితాలను చిదిమేస్తోందా? దూమపాన ప్రియులు క్రమంగా పెరుగుతుందా? ఈ ఉచ్చు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? దాని నుంచి బయటపడేవారు కొందరైతే.. రాలేకపోతున్నవారు ఎందరో? వారే కాదు.. వాసన పీల్చినవారు సైతం ప్రాణాలు పొగొట్టుకుంటున్నారా? కొత్త పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
మనం సినిమాలుకు వెళ్లినప్పుడు థియేటర్లో సిగరెట్లు ఎంత ప్రమాదకరమైనవో ప్రకటనలు చెబుతున్నాయి. అయినా తగ్గేది లేదంటున్నారు కొందరు. స్మోకింగ్ చేయకుంటే ఆలోచన తట్టదని కొందరు చెబుతారు. కానీ ధూమపానం ఆరోగ్యానికి హానికరం, అంతేకాదు దానివల్ల జీవితాలు దుర్భరంగా తయారు అయిన సందర్భాలు కోకొల్లలు.
యూకెలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై స్టడీ చేశారు. దూమపాన ప్రియుల గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. ఒక సిగరెట్ వల్ల పురుషులు తమ జీవితంలో 17 నిమిషాలు కోల్పోతారని తేల్చింది. అదే మహిళలు 22 నిమిషాలు కోల్పోతారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంటే 20 సిగరెట్ల గల ప్యాక్ తీసుకుంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏడు గంటల జీవితం తగ్గుతుందని సూటిగా సుత్తిలేకుండా హెచ్చరించింది.
జనవరి ఒకటి నుంచి దూమపానం మానేసిన వ్యక్తి.. రోజుకు 10 సిగరెట్లు తాగే వ్యక్తికి కంపేర్ చేసింది. దూమపానం నుంచి బయట పడినవారు అదనపు జీవితం పొందవచ్చని తేల్చేంది. ఆగష్టు నాటికి ఒక నెల, ఏడాదికి 50 రోజుల అదనంగా పొందవచ్చని తేల్చింది. ఈ నేపథ్యంలో పొగ తాగేవారు దాని నుంచి బయటపడేందుకు కొత్త సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టాలని పరిశోధకులు సూచన చేశారు.
ALSO READ: దుబాయ్‌లో కూలిన విమానం.. మృతుల్లో ఇండియన్ డాక్టర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కన ప్రకారం.. ప్రపంచం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులలో పొగాకు మహమ్మారి కూడా ఒకటని చెబుతోంది. దీని బారినపడి ప్రతి ఏటా 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది తమ జీవితాలను కోల్పోతున్నారని తేల్చింది.
తాగిన వ్యక్తి నుంచి పొగ పీల్చేవారు 1.3 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులలో 80% మంది తక్కువ, మధ్య – ఆదాయ దేశాలలో ఎక్కువ మంది ఉంటున్నారు. అందుకే ఇక్కడ పొగాకు సంబంధిత అనారోగ్యం, మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది.