BigTV English

Nikki Haley: నిక్కీ హేలీ తొలి విజయం.. ట్రంప్ విజయాలకు బ్రేక్..

Nikki Haley: నిక్కీ హేలీ తొలి విజయం.. ట్రంప్ విజయాలకు బ్రేక్..

 Nikki Haley newsRepublican Party Presidential Candidate Elections(International news in telugu ): రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ తొలి విజయాన్ని నమోదు చేశారు. కీలకమైన వాషింగ్టన్ డీసీలో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు.


51 ఏళ్ల హేలీ వాషింగ్టన్ డీసీ ఎన్నికల్లో 1,274 ఓట్లు (62.9 శాతం) పొందగా, తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ 676 ఓట్లు (33.2 శాతం) సాధించారు. దీంతో హేలీ తొలి విజయాన్ని నమోదు చేసి ట్రంప్ విజయ పరంపరను నిక్కీ బ్రేక్ చేశారు. నిక్కీ హేలీకి మొత్తం 43 మంది డెలిగేట్లు ఉండగా.. ట్రంప్‌కు 247 మంది ఉన్నారు.

దీంతో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తొలి మహిళగా హేలీ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీలలో గెలిచిన మొదటి భారతీయ-అమెరికన్‌గా కూడా హేలీ రికార్డు సృష్టించింది.


Read More: అమెరికాలో భారతీయ నృత్య కళాకారుడు దారుణ హత్య

2016లో బాబీ జిందాల్, 2020లో కమలా హారిస్, 2024లో వివేక్ రామస్వామి – అమెరికా అధ్యక్ష పదవిని ఆశించి ఒక్క ప్రైమరీ కూడా గెలవలేకపోయారు.

హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్వవహరించారు. తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో ఓడిపోయింది. కానీ US చరిత్రలో రిపబ్లికన్ ప్రైమరీ గెలిచిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. మిస్సౌరీ, ఇడాహోలోని కాకస్‌లలో, మిచిగాన్‌లో జరిగిన ఎన్నికల్లో హేలీ ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు.

Read More: మేం మీ కీలు బొమ్మలం కాదు.. చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్..

77 ఏళ్ల ట్రంప్ నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో 81 ఏళ్ల ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాట్ జో బిడెన్‌తో తలపడే అవకాశం ఉంది. ట్రంప్ ఇంతకు ముందు జరిగిన నామినేటింగ్ పోటీలో ఆధిపత్యం చెలాయించారు.

హేలీ అభ్యర్ధి రేసులో నిలవాలంటే మొత్తం 1215 మంది డెలిగేట్లను సొంతం చేసుకోవాలి. కానీ ట్రంప్ మార్చి 5 న సూపర్ ట్యూస్‌డే రోజున మరింత మంది ప్రతినిధులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×