Illu Illalu Pillalu ToIlluday Episode August 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు వ్రతం అంటున్నారు కదా చేస్తే మంచిదే కదా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటాడు. వేదవతి నా కోడలు అనిపించుకున్నారు. ఏదైనా అనుకుంటే సాధించే తీరుతారు కదా అని కోడలను చూసి మురిసిపోతూ ఉంటుంది.. అయితే భాగ్యం శ్రీవల్లి వెళ్ళిపోతుంటే నర్మదా వాళ్ళని పిలుస్తుంది. వాళ్లు ముగ్గురు షాక్ అవుతారు. బల్లి అక్క రేపు వ్రతం అంట మర్చిపోవద్దు అని నర్మదా అంటుంది.. అవునక్కా నువ్వెందుకు రేపే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలని అనుకుంటున్నావు అని ప్రేమ అడుగుతుంది. ఏం లేదు ప్రేమ వీళ్ళిద్దరూ నగల విషయంలో ఏదో చేస్తున్నారు కదా.. దాన్ని ఎలాగైనా బయట పెట్టాలని నేను అనుకుంటున్నాను అని నర్మదా అంటుంది. వరలక్ష్మీ వ్రతంలో వాళ్ల నగలు డబ్బులను ప్రతి ఒక్కరు అక్కడ పెడతారు. అయితే వల్లి అక్క కూడా ఆ నగలని పూజలు పెట్టాలి. వేరే కారణాలు చెప్తే నగలు తీసుకురారు.. ఇలా చేస్తేనే ఖచ్చితంగా నగలని తీసుకొస్తారు అని అంటుంది నర్మదా. అవునక్కా నువ్వు చెప్పింది నిజమే అని ప్రేమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో వ్రతం కదా అని తమ భార్యలు కొత్త చీరలు కట్టుకోవాలని, ముగ్గురు అన్నదమ్ములు కలిసి షాప్ కి వెళ్లి భార్యల కోసం ప్రేమగా చీరలని కొనుక్కొని వస్తారు. నర్మలకు ముందుగా సాగర్ చీరలు తీసుకుని వెళ్లి ఇస్తాడు. నర్మద మాత్రం సాగర్ ని అసలు పట్టించుకోకుండా ఉంటుంది. నువ్వంటే నాకెంత ఇష్టం చూసావా? నీకోసం ఎంత మంచి చీర తీసుకొచ్చాను అని సాగర్ అంటాడు. దానికి నర్మదా అందుకేనా నడిరోడ్డు మీద నేను పిలుస్తున్న కూడా పట్టించుకోకుండా వెళ్లి నన్ను ఏడ్చేలా చేసావని నర్మదా అంటుంది. అప్పుడు పరిస్థితులు వేరు నువ్వు ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని సాగర్ అంటాడు.
నువ్వంటే నాకు ఎంత ఇష్టం లేకపోతే నీకోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటాను అని సాగర్ అంటాడు. కోపం వస్తే తిట్టవే మహా అయితే కొట్టవే అని సాగర్ నర్మదను బ్రతిమలాడుతాడు. ఆ మాట అనగానే నర్మదా కొడుతుంది. మొత్తానికి ఇద్దరు ఒక్కటైపోతారు. మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి ఈ చీరలు సెలెక్ట్ చేశారు అని చెప్పగానే.. చీర చాలా బాగుంది వాళ్ళకి థాంక్స్ చెప్పానని చెప్పు అని అంటుంది నర్మదా.. అటు ధీరజ్ ప్రేమకు చీరలు తెచ్చి ఇస్తాడు..
ప్రేమ మాత్రం టైం దొరికినప్పుడల్లా ధీరజ్ ని ఆడుకుంటుంది.. నాకోసం నువ్వు చీర తీసుకురావడమేంటి? వస్తువులు పాత చీర కట్టుకున్న చినిగిన చీర కట్టుకున్న నీకు అవసరం లేదు కదా అనేసి అంటుంది. ప్రేమగా నీకు చీర తీసుకొచ్చాను నువ్వంటే నాకు అంత ఇష్టం అన్నట్టు ఇండైరెక్టుగా ధీరజ్ చెప్తాడు . తమ భార్యలు రెడీ అవ్వడం చూసి సాగర్ ధీరజ్ ఇద్దరు మురిసిపోతారు. కానీ శ్రీవల్లి మాత్రం చందు తెచ్చిన చీరను కాకుండా వేరే చీరను కట్టుకుని వస్తుంది.
Also Read: పల్లవి ప్లాన్ రివర్స్.. ప్రణతి, భరత్ ల పెళ్లికి పార్వతి ఒప్పుకుంటుందా..?
శ్రీవల్లి ఎందుకు తను తెచ్చిన చీరను కట్టుకోలేదని చందు బాధపడుతూ ఉంటాడు. ఇక వ్రతంలో కూర్చునేందుకు అంత సిద్ధం చేస్తారు ముగ్గురు కోడలు.. అయితే శ్రీవల్లి వ్రతం చేసే దంపతులు పీటల మీద కూర్చొని పంతులుగారు అనగానే మావయ్య గారండీ ఇంటికి నేను పెద్ద కోడల్ని కదా నేను వ్రతం చేస్తానండి అని అడుగుతుంది.. వేదవతి మాత్రం ముగ్గురు కోడలు చేయాల్సిన వ్రతం ఈమె చేస్తానంటుంటుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు కోడలు ఎంత గొడవ చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రీవల్లి నాటకం ఆడుతుంది అని తెలుస్తుంది.. మరి పూజ చేయడానికి రామరాజు ఒప్పుకుంటాడా? నర్మదా ప్రేమల ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? అనేది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..