Indian Railways: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. 26 మంది భారత పౌరులను చంపిన ముష్కరులను అంతకు రెట్టింపు సంఖ్యలో మట్టుబెట్టింది. భారత్ కు ఆపద కలిగిస్తే ఎక్కడి వరకైనా వచ్చి చావు దెబ్బకొడతాం అని నిరూపించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఏకంగా పాకిస్తాన్ లోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. పీఓకేతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 స్థావరాలను కుప్పకూల్చింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. పాకిస్తాన్ ప్రజలకు, అక్కడి ఆర్మీకి ఏమాత్రం నష్టం కలగకుండా కేవలం ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసినట్లు భారత్ వెల్లడించింది. ఈ అటాక్స్ తో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
భారత రైల్వే కదలికలపై పాక్ నిఘా
ఆపరేషన్ సిందూర్ కు ఒక రోజు ముందుగానే రైల్వే తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత రైల్వే కదలికలపై పాక్ నిఘా వ్యవస్థలు ఫోకస్ పెట్టినట్లు హెచ్చరించింది. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి సమాచారాన్ని పంచుకోకూడదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ నిఘా వ్యవస్థకు చెందిన వ్యక్తులు, భారత రైల్వే అధికారులకు సిబ్బందికి, ఫోన్ చేసి సైనిక సమాగ్రిని తీసుకెళ్లే రైళ్ల కదలికలకు సంబంధించి రహస్య సమాచారాన్ని తెసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు మెసేజ్ పాస్ చేసింది. “రైల్వే అధికారులు మిల్ రైల్ సిబ్బంది (రైల్వేస్ మిలిటరీ వింగ్) కాల్ చేసి రహస్య సమాచారాన్ని ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఎలాంటి అనధికారిక వ్యక్తులతో ఆర్మీకి సంబంధించిన వివరాలను పంచుకోవద్దు. ఏ విషయం బయటకు వెళ్లినా జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుంది” అని వెల్లడించింది.
Read Also: మసూద్ ఫ్యామిలీలో చనిపోయింది వీరే.. పహల్గామ్ దాడితో వీడికి సంబంధం ఏమిటీ?
మిల్ రైల్ అంటే ఏంటి?
మిల్ రైల్ అనేది రక్షణ దళాలకు సంబంధించిన లాజిస్టికల్ సపోర్టు అందించే భారతీయ రైల్వే ప్రత్యేక విభాగం. “సైన్యానికి మద్దతుగా నిలిచే మిల్ రైల్ సమాచారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయం బయటకు వెళ్లడానికి వీళ్లేదు. ఎవరితోనూ ఈ విషయాలను పంచుకోవద్దు అని రైల్వే అధికారులు రైల్వే సిబ్బందికి సూచించాలని కోరుతున్నాం” అని రైల్వే బోర్డు వెల్లడించింది. ఎవరు, ఎన్ని రకాలుగా సైనిక కదలికల గురించి సమాచారం కోరినా, ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదు. ఎవరు ఏమాత్రం సమాచారం లీక్ చేసినా, భారత్ కు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విషయంలో రైల్వే అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేయాలని రైల్వే మంత్రిత్వశాఖ రైల్వే సీనియర్ అధికారులను కోరింది.
Read Also: కాశ్మీర్ లో ఆపరేషన్ సిందూర్ టెన్షన్, అందుబాటులో స్పెషల్ రైళ్లు!