E-Paper
Advertisement

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Upcoming SUVs in India 2026-27: భారత్ లో SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్టైల్‌ తో పాటు పవర్, ఆఫ్ రోడ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు కోరుకునే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో  కొన్ని క్రేజీ SUVలు భారత మార్కెట్‌లోకి రానున్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడళ్లు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

JSW జెటూర్ T2 ఆధారిత PHEV SUV

JSW మోటార్స్ నుంచి కొత్త రగ్గడ్ SUV రానుంది. ఇది జెటూర్ T2 ఆధారంగా తయారవుతోంది.  ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది. నగరాల్లో ఎలక్ట్రిక్‌తో, సుదూర ప్రయాణాల్లో పెట్రోల్‌తో నడిపే అవకాశం ఉంటుంది. AWD, టెర్రైన్ మోడ్స్, పెద్ద టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి ఫీచర్లు రావొచ్చని అంచనా.

మహీంద్రా థార్ 3 డోర్ ఫేస్‌ లిఫ్ట్

Advertisement

మహీంద్రా థార్‌కు ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇప్పుడు 3 డోర్ థార్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. కొత్త గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్, మెరుగైన ఇంటీరియర్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు 4WD సామర్థ్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

టాటా సఫారీ EV

టాటా నుంచి రాబోయే అత్యంత ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ SUVల్లో సఫారీ EV ఒకటి. ఇది మూడు వరుసల సీటింగ్‌తో పాటు కొన్ని వేరియంట్లలో AWD సిస్టమ్‌ను అందించవచ్చని తెలుస్తోంది. హారియర్ EV తరహాలో డ్యూయల్ మోటార్ సెటప్ ఉండే అవకాశం ఉంది. 65 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లు రావొచ్చని భావిస్తున్నారు. పెద్ద టచ్‌ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు.

టాటా సియెర్రా ICE AWD

Advertisement

టాటా సియెర్రా తిరిగి మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో పాటు AWD వెర్షన్ కూడా రావొచ్చని తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయి ఆఫ్-రోడర్ కాకపోయినా, రోజువారీ వినియోగంతో పాటు కఠినమైన రోడ్లపై ప్రయాణించేందుకు అనువుగా ఉండే అవకాశం ఉంది.

కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్

దేశంలో ఫార్చ్యూనర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి కొత్త తరం వెర్షన్ రానుంది. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి  ఫీచర్లతో రావొచ్చని అంచనా. 4WD సామర్థ్యాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉంది.

JSW iCar V23 ఆధారిత ఎలక్ట్రిక్ SUV

JSW మరో ఎలక్ట్రిక్ SUVను కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది బాక్సీ, రెట్రో స్టైల్ డిజైన్‌తో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో RWD, AWD వెర్షన్లు రావొచ్చు. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అడ్వెంచర్ లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

Read Also: టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×