BigTV English

Pakistan: పీఎం మోదీ పేరు చెప్పడానికి భయం.. మా ప్రధాని పిరికోరంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Pakistan: పీఎం మోదీ పేరు చెప్పడానికి భయం.. మా ప్రధాని పిరికోరంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Pakistan: ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై ఆ దేశ ఎంపీలకు టెన్షన్ మొదలైంది. ఇది ముమ్మాటికీ ప్రధాని వ్యవహారశైలి వల్లే ఇలా జరిగిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియా ప్రధాని మోదీ పేరు చెప్పడానికి మా దేశ ప్రధాని భయటపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత సైన్యం. ఈ క్రమంలో తొమ్మది ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులను బయటకు తరలించి సైన్యాన్ని మోహరించింది. ఆపై కయ్యానికి కాలు దువ్వింది.

అసలేం జరుగుతోంది?


పరిస్థితి గమనించిన భారత్ సైన్యం కొద్దిరోజులు ఓపిక పట్టింది. చివరకు భారత్ సరిహద్దు గ్రామాల ప్రజలపై క్షిపణుల ఎక్కుపెట్టడంపై మరింత ఆగ్రహం కలిగింది. దీంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాన్ని కంటిన్యూ చేస్తోంది కూడా. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్మీ, వైమానిక దాడులు జరుగుతున్నాయి.

నష్టం ఏ స్థాయిలో జరిగిందనేది దాయాది దేశం బయటకు చెప్పలేదు. తాము పైచేయి సాధించామని అక్కడి ప్రజలు, మీడియాను నమ్మించే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో పాక్‌కు కోలుకోలేని దెబ్బ తగలింది. పంజాబ్ ప్రావెన్స్‌కి భారత వైమానిక సేనలు, మూడు విమానాలను నేలకూల్చాయి. అందులో రెండు జెట్ ఫైటర్లు కాగా, మరొకటి బలమైన రాడార్ వ్యవస్థకి చెందిన విమానం.

ALSO READ: పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా అమెరికా ప్రకటించాలి-పెంటగాన్ అధికారి

ఆ తర్వాత ఆదేశ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ ఇళ్ల సమీపంలో పేలుళ్లు సంభవించాయి. కాకపోతే అధికారికంగా ఆదేశం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆదేశ జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిపై కొందరు ఎంపీలు దుమ్మెత్తిపోశారు.

పాక్ ప్రదానిపై ఆదేశ ఎంపీలు ఆగ్రహం

మాదేశ ప్రధాని పిరికివారు.. భారత్ ప్రధాని నరేంద్రమోడీ పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దళాలను సింహం నడిపించలేదని రుసరుసలాడారు. భారత ప్రతీకార చర్యలపై ఆదేశ జాతీయ అసెంబ్లీలో ఓ ఎంపీ కేకలు వేశారు. ఇప్పటివరకు అతివాదుల నుంచే కాకుండా ఇప్పుడు ఎంపీల నుంచి నిరసనను ఎదుర్కొంటోంది ఫరీఫ్ ప్రభుత్వం.

ఇదే కంటిన్యూ అయితే పాకిస్తాన్‌లో రాజకీయాల్లో మరో సంక్షోభం రావచ్చని అంటున్నారు. అప్పుడు సైన్యం రంగం ప్రవేశం చేసే అవకాశముందన్నది కొందరు నిపుణుల వాదన. మొత్తానికి రాబోయే రోజుల్లో పాక్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×