BigTV English

India Pakistan War: పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశంగా అమెరికా ప్రకటించాలి.. పెంటగాన్ అధికారి

India Pakistan War: పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశంగా అమెరికా ప్రకటించాలి.. పెంటగాన్ అధికారి

India Pakistan War| ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ అమెరికాలోని పెంటగాన్ మాజీ అధికారి భారత చర్యలను సమర్థించారు. పహల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ ప్రతిచర్యగానే ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిందని.. ఉగ్రవాదులకు సహకరించే పాకిస్తాన్ పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ అన్నారు. భారత్ కు మద్దతు తెలుపుతూ అమెరికా కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.


“గతంలోనే లష్కరె తయిబా ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కానీ ఇలాంటి సంస్థలకు మూలం పాకిస్తాన్. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించేది పాకిస్తాన్ ప్రభుత్వమే. మరి పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ఇప్పటివరకూ ఎందుకు ప్రకటించలేదు. ఇక ఉగ్రవాదమనే ఆక్టోపస్ కాళ్లను నరకింది చాలు. ఇక తల నరకాలి. ఈ యుద్ధంలో అమెరికా నిష్పాక్షికంగా భారతదేశం వైపు నిలబడాలి.” అని మైకేల్ రూబిన్ నేరుగా పాకిస్తాన్ పై అటాక్ చేశారు.

ప్రస్తుతం అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ లో సీనియర్ ఫెలో మెంబర్ గా విధులు నిర్వర్తిస్తున్న మైకేల్ రూబిన్.. పాకిస్తాన్ ఒక దేశంగా విఫలమైందని అభిప్రాయపడ్డారు. అదే ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ దేశ పౌరులను కాపాడేందుకు తీసుకున్న చర్యలు సరియైనవే నని అన్నారు.


“భారతదేశంలో రాజకీయ పార్టీలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. భారతీయుల భద్రతకే వారి ప్రాధాన్యం. కానీ పాకిస్తాన్ లో అలా జరగడం లేదు. భారత్ లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ లేదు. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి. హిందువులు, ముస్లింలు కలిసి ఒక చోట ఉండలేరని ఆయన చెప్పడం చాలా తప్పు. ఇండియాలో కలిసే ఉంటున్నారు కదా.. పాకిస్తాన్ లో అలా ఎందుకు జరగడం లేదంటే అక్కడి ప్రభుత్వం మైనారిటీలైన హిందువులను హింసిస్తోంది. వారిని క్రమంగా దేశం నుంచి వెళ్లగొడుతోంది. అందుకే పాకిస్తాన్ ఒక దేశంగా విఫలమైంది” అని రూబిన్ మండిపడ్డారు.

పాకిస్తాన్ లో అవినీతి గురించి, బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి అక్కడి నాయకత్వం గురించి ఎవరైనా విమర్శిస్తే.. అక్కడి ప్రభుత్వం ఆ అంశాలు చర్చకు రాకుండా మైనారిటీపై దాడులు చేయిస్తుంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యాలను కప్పింపుచ్చుకోవడానికే.. కానీ ఇండియా చాలా డిఫరెంట్.. భారతీయులంతా కలిసి మెలిసి జీవిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాను. 26 మంది అమాయకులను చంపడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇదంతా పాకిస్తాన్ వల్లే జరిగింది. చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. కానీ ఇంతకాలం పశ్చిమ దేశాలు పాకిస్తాన్ ని ఉపేక్షించాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ లో కూడా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే పాకిస్తాన్ ని ఇప్పుడ నిర్వీర్యం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక ఉపేక్షించనే కూడదు. అని రూబిన్ ఆగ్రహంగా ఇంటర్‌వ్యూలో మాట్లాడారు.

Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..

పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం వైమానికి దాడులు చేస్తే.. పాక్ సైన్యం మాత్రం సరిహద్దు గ్రామాల్లో అమాయక పౌరులపై విచ్చలవిడిగా కాల్పులు జరిగింది. పాకిస్తాన్ చేసిన యుద్ధ నేరంగా దీన్ని పరిగణించాలని కూడా రూబిన్ చెప్పారు.

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×