BigTV English

Pakistan China Weapons: పాకిస్థాన్‌కు అండగా డ్రాగన్ దేశం.. అత్యధిక ఆయుధాలు చైనా నుంచే సరఫరా

Pakistan China Weapons: పాకిస్థాన్‌కు అండగా డ్రాగన్ దేశం.. అత్యధిక ఆయుధాలు చైనా నుంచే సరఫరా

Pakistan China Weapons| భారత దేశం దాడి చేస్తే.. తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.. కానీ చైనా తయారీ ఆయుధాలపై అధికంగా ఆధారపడుతోంది. ఇటీవల పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చర్యలు చేపట్టబోతున్న నేపథ్యంలో.. దేశంలోని త్రివిధ దళాలు – భూసైన్యం, నౌకా దళం, వైమానిక దళం – పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. భారత్ ఎప్పుడెప్పుడు ప్రతిదాడి చేస్తుందా అన్న భయంలో పాకిస్తాన్ ఉంది. ఈ క్రమంలో భారత్ దాడి చేస్తే తాము కూడా ప్రతిదాడికి సిద్ధమని పాక్ చెప్పుకొచ్చింది.


ఇందులో భాగంగా, ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో JF-17 ఫైటర్ జెట్‌లను మోహరించింది. వీటిని ప్రధానంగా సర్గోధా, మౌరిపూర్ వంటి ఎయిర్‌బేస్‌లలో ఉంచినట్టు తెలుస్తోంది. గతంలో ఈ స్థావరాలలో అమెరికన్ F-16 యుద్ధ విమానాలను ఉంచిన పాక్, ఇప్పుడు వాటిని గ్వాదర్ సమీపంలోని పస్ని ఎయిర్‌బేస్‌కు తరలించింది. దీనికి కారణం, భారతదేశం వద్ద ఉన్న ఆధునిక S-400 వాయు రక్షణ వ్యవస్థ ఈ F-16 లకు ముప్పుగా మారే అవకాశం ఉన్నదనే భయం. ఆ కారణంగా, ఇప్పుడు F-16లకు బదులుగా చైనా సహకారంతో రూపొందించిన JF-17 విమానాలను వాడుతోంది.

చైనా ఆయుధాలే పాకిస్తాన్ బలం
భారతదేశంతో యుద్ధం జరిగితే, పాకిస్తాన్ ప్రధానంగా చైనా తయారీ ఆయుధాలపైనే ఆధారపడనుంది. ఇప్పటికే పాక్ వైమానిక దళంలో గణనీయంగా చైనా ఆయుధాలు ఉన్నాయి. ముఖ్యంగా JF-17 థండర్ ఫైటర్ జెట్‌ విమానాన్ని పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసినది. ఇది భారత రాఫెల్‌కు ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసింది. అంతేకాక, F-7PG స్కైబోల్ట్ అనే మిగ్-21 తరహా చైనా విమానాలను కూడా అందుకుంది. అలాగే, శిక్షణ కోసం K-8 కారకోరం విమానాలను వాడుతోంది.


డ్రోన్ల విషయంలో పాక్ చైనా తయారీ వింగ్ లూంగ్ II, CH-4 UAVలను కూడా పొందింది. అలాగే, JF-17లకు SD-10 (PL-12) వంటి మధ్యస్థ గాలి నుండి గాలికి క్షిపణులు, PL-5, PL-8, PL-9C వంటి స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ చైనాలో తయారైనవే. చైనా తయారు చేసిన CM-400AKG (యాంటీ-షిప్ మిసైల్), C-802AK (క్రూయిజ్ మిసైల్) లాంటి ఆయుధాలు కూడా JF-17 ఫ్లీట్‌లో ఉన్నాయి.

Also Read: స్విగ్గీలో బంగారం డెలివరీ.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్‌తో.. నిజమా?

సర్గోధా ఎయిర్‌బేస్ లో చైనా ఫైటర్ జెట్లు
పంజాబ్ ప్రావిన్స్‌లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న కిరాణా కొండల సమీపంలో ఉన్న సర్గోధా ఎయిర్‌బేస్, పాక్‌లోని అతిపెద్ద, కీలకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి. గతంలో ఇక్కడ పాక్ అత్యుత్తమ F-16 విమానాలను ఉంచింది. ప్రస్తుతం, వాటి స్థానంలో JF-17 విమానాలను మోహరించింది. ఈ మోహరింపు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. కరాచీలోని మౌరిపూర్ ఎయిర్‌బేస్‌లోనూ JF-17 విమానాలను హ్యాంగర్‌లలో నిలిపి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ బేస్‌ కూడా గతంలో F-16లకు స్థావరంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మేడ్ ఇన్ చైనా విమానాలకు ఆధారపడుతోంది.

పాక్ ఆర్మీలో చైనా ఆయుధాలు:

టైప్ 59, 69, 85-IIAP ట్యాంకులు – పాత చైనా నమూనాలు

VT-4 – ఆధునిక ప్రధాన యుద్ధ ట్యాంక్

A-100 మల్టిపుల్ రాకెట్ లాంచర్

SH-15 హోవిట్జర్ – 155mm ట్రక్కు-మౌంటెడ్ గన్

HJ-8, HJ-10 ATGMs – యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు

LY-80 (HQ-16) – ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలపై దాడిచేసే మిసైల్ సిస్టమ్

FN-6 MANPADS – మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్

టైప్ 85 APC – బుల్లెట్‌ప్రూఫ్ ట్రూప్ క్యారియర్ వాహనం

KJ-2000 రాడార్ వ్యవస్థ – మద్దతు రాడార్

 

పాక్ ఎయిర్‌ఫోర్స్‌లో చైనా విమానాలు, ఆయుధాలు:

JF-17 థండర్ – ఈ ఫైటర్ జెట్ విమానాన్ని పాకిస్తాన్-చైనా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

WS-13 ఇంజిన్ – JF-17 ఫైటర్ జెట్ కోసం చైనా రూపొందించిన ఇంజిన్

F-7PG స్కైబోల్ట్ – మిగ్-21 ఆధారంగా రూపొందించిన చైనా యుద్ధ విమానం

K-8 కారకోరం – శిక్షణ విమానం

CH-4 UAV, వింగ్ లూంగ్ II UAV – మానవరహిత పోరాట డ్రోన్లు

SD-10 (PL-12), PL-5, PL-8, PL-9C – గాలి నుండి గాలికి క్షిపణులు

CM-400AKG, C-802AK – యాంటీ-షిప్ మరియు క్రూయిజ్ క్షిపణులు

 

పాక్ నేవీలో చైనా పరికరాలు:

F-22P జుల్ఫిక్వార్ ఫ్రిగేట్లు – టైప్ 053H3 ఆధారంగా

టైప్ 054A/P ఫ్రిగేట్లు – ఆధునిక గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్లు

హ్యాంగోర్ సబ్‌మెరైన్‌లు – AIP సబ్‌మెరైన్లుగా నిర్మాణంలో ఉన్నవి

C-802, YJ-62, CM-302 క్షిపణులు – యాంటీ-షిప్ క్షిపణులు

LY-60N నావల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్

హార్బిన్ Z-9EC హెలికాప్టర్లు – యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లు

SR2410C రాడార్ వ్యవస్థ – ఆధునిక నౌకలపై మౌంటెడ్ ఉన్నది

చైనా పోరాట నిర్వహణ వ్యవస్థలు – పాక్ నౌకాదళానికి ముఖ్యమైన సాంకేతిక పరికరాలు

ఈవిధంగా చూస్తే, పాకిస్తాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలన్నీ చైనా తయారీ ఆయుధాలపైనే విస్తృతంగా ఆధారపడుతున్నాయని స్పష్టమవుతోంది. భారతదేశానికి వ్యతిరేకంగా జరగబోయే ఏదైనా సైనిక చర్యలోనూ చైనా టెక్నాలజీనే కీలక పాత్ర పోషించనుంది.

 

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×