BigTV English

Pakistan China Stealth Jets: పాకిస్తాన్‌కు 40 చైనా జె-35 ఫైటర్ జెట్స్.. ఇండియాకు ఇది పెద్ద సవాలే, ఎందుకంటే?

Pakistan China Stealth Jets: పాకిస్తాన్‌కు 40 చైనా జె-35 ఫైటర్ జెట్స్.. ఇండియాకు ఇది పెద్ద సవాలే, ఎందుకంటే?

Pakistan China Stealth Jets| శత్రువుకి శత్రువు మిత్రుడంటారు. అందుకే భారతదేశం నుంచి వేరుపడి ఏర్పడ్డ పాకిస్థాన్ ఆ సమయం నుంచే ఇండియాతో శత్రుత్వం కొనసాగిస్తోంది. మరోవైపు భారత్ అభివృద్ధి, ఎదుగుదలతో అసూయ పడి కుట్రలు చేసే చైనా.. భారత్ పొరుగు దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకొని ఇండియాకు వ్యతిరేకంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన వైమానిక దాడుల్లో పాకిస్థాన వైమానిక స్థావరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇదంతా భారత్ ఉపయోగించిన అత్యాధునిక యుద్ధ విమానాలతో సాధ్యమైంది. అయితే ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతున్నా.. పూర్తి స్థాయిలో ఇక అంతా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఇరు దేశాలు ప్రకటించలేదు. ఈ క్రమంలో పాకిస్థాన్ తిరిగి తన వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే చైనా నుంచి అత్యాధునిక విమానాలు కొనుగోలు చేస్తోంది.


ఈ ఏడాది చివరి నాటికి పాకిస్థాన్‌కు 40 కొత్త J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా సరఫరా చేయనుంది. దీంతో పాకిస్థాన్.. అత్యాధునిక ఫిఫ్త్ జెనరేషన్ యుద్ధ విమానాలను నడిపే కొన్ని దేశాలలో ఒకటిగా మారనుంది. చైనా తన సొంత వైమానిక దళంలో కూడా ఇప్పుడే వినియోగిస్తున్న J-35ను మొదటిసారి విదేశాలకు విక్రయిస్తోంది.

పాకిస్థాన్‌కు J-35 యొక్క FC-31 వెర్షన్ లభిస్తుంది. ఇది భూమిపై దాడుల కోసం రూపొందించిన ల్యాండ్-బేస్డ్ మోడల్. ఇది విమాన వాహక నౌకల నుంచి ఎగిరే నావల్ వెర్షన్‌కు భిన్నం. FC-31లో ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్-అండ్-ట్రాక్ సిస్టమ్, ఇతర ఆయుధాలతో సమాచారాన్ని షేర్ చేసుకునే టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.


భారత్‌కు సవాల్?
భారత్‌ వద్ద ఇంకా ఫిఫ్త్ జెనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు. సైనిక నిపుణులు దీనిని తీవ్రమైన సమస్యగా భావిస్తున్నారు. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అజయ్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వైమానిక దళంలో J-35 ఫైటర్ జెట్లు ఉండడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.

ప్రస్తుతం భారత్‌ వద్ద రఫేల్, SU-30MKI వంటి పవర్‌ఫుల్ క్తివంతమైన జెట్లు ఉన్నాయి. కానీ J-35 వంటి స్టెల్త్ జెట్లను రాడార్‌లో గుర్తించడం చాలా కష్టం. దీని వల్ల పాకిస్థాన్ పై వైమానిక ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ కు సమస్య మారుతుంది. అమెరికా F-35 లేదా రష్యా యొక్క Su-57 జెట్లను కొనడం సరైన నిర్ణయం కాదని అహ్లావత్ సూచించారు. భారత్ తన సొంత స్టెల్త్ జెట్—AMCA—ను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

J-35 గురించి తెలుసుకుందాం
J-35 లేదా J-35A గా పిలవబడే ఈ స్టెల్త్ ఫైటర్ చైనాకు చెందిన రెండవ స్టెల్త్ ఫైటర్. అంతకుముందు నుంచి చైనా వద్ద J-20 స్టెల్త్ ఫైటర్ ఉంది. షెన్‌యాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ దీనిని తయారు చేసింది. 2024లో చైనా ఎయిర్ షోలో, ఆ తర్వాత 2025లో పారిస్ ఎయిర్ షోలో ఈ జెట్‌ను ప్రజలకు చూపించారు.

ఈ జెట్‌లో రెండు ఇంజన్లు ఉన్నాయి. ఈ జెట్ ఫైటర్లు ధ్వని కంటే వేగంగా ప్రయాణించగలవు. అధునాతన రాడార్ సిస్టమ్, టార్గెటింగ్ సిస్టమ్‌లు, 0.001 చదరపు మీటర్ల రాడార్ క్రాస్-సెక్షన్ ఉన్నాయి. అంటే, ఇది సాధారణ రాడార్‌లకు దాదాపు కనిపించదు. ఇది అమెరికా F-35 లాంటిది. J-35 ఇతర ఆయుధాలను గైడ్ చేయగలదు, శత్రువులను ముందుగా గుర్తించి దాడి చేయడంలో బలంగా ఉంటుంది.

అమెరికా నుంచి కాపీ చేశారా?
కొందరు నిపుణులు J-35 అమెరికా యొక్క F-35ను పోలి ఉందని అంటున్నారు. 2009లో, F-35 ప్రోగ్రామ్ నుంచి హ్యాకర్లు డేటాను దొంగిలించినట్లు అమెరికా ధృవీకరించింది. 2014లో, ఒక చైనా వ్యాపారవేత్త అమెరికా జెట్లపై 6 లక్షల ఫైళ్ళను దొంగిలించడంలో సహాయపడ్డాడని ఆరోపణలు వచ్చాయి. F-35ని కచ్చితంగా కాపీ చేయడం కష్టమైనా, కొన్ని డిజైన ఆలోచనలు వాడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

J-35ను విరుగుడుగా AMCA ప్రోగ్రామ్ ప్రారంభించిన భారత్
భారత్ తన సొంత స్టెల్త్ ఫైటర్ AMCAను తయారు చేస్తోంది. ఇది 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇటీవల ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది, కానీ ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది. అప్పటి వరకు, J-35 వంటి స్టెల్త్ జెట్లను గుర్తించడం భారత్ రాడార్‌లకు సవాలుగా ఉండవచ్చు.

Also Read: పాక్ కాళ్లబేరం.. ట్రంప్ సీజ్ ఫైర్ రిక్వెస్ట్ అంతా హంబక్.. ఆ క్రెడిట్ సౌది ప్రిన్స్‌దే

చైనా తక్కువ ఖర్చుతో, వేగంగా J-35 జెట్లను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. భారత్ AMCA ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయకపోయినా లేదా తన వైమానిక రక్షణ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయకపోయినా.. స్టెల్త్ టెక్నాలజీ రంగంలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడి పోవచ్చు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×