E-Paper
Advertisement

నమన్ ధీర్ క్యాచ్ పై వివాదం…బంతి నేలకు తగిలిందంటూ ఇంజమామ్ ఆరోపణలు

నమన్ ధీర్ క్యాచ్ పై వివాదం…బంతి నేలకు తగిలిందంటూ ఇంజమామ్ ఆరోపణలు
Advertisement

Inzamam-ul-Haq On Naman Dhir Diving Catch:  టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరుగుతోన్న రెండో వన్డే సందర్భంగా నమన్ ధీర్ అందుకున్న అదిరిపోయే క్యాచ్ పై వివాదం రాజుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడాడు విండీస్ ఓపెనర్ కీసీ కార్టీ. ఈ తరుణంలో ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తోన్న కొత్త కుర్రాడు నమన్ ధీర్ ముందుకు డైవ్ చేసి, స్టన్నింగ్ క్యాచ్ (Naman Dhir Diving Catch) పట్టుకున్నాడు. రివ్యూలో బంతి నేలకు తగలలేదని తేలడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు. కానీ ఇంజమామ్ వుల్ హక్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. బంతి నేలకు తగిలిందని, అసలు అది ఔటే కాదంటూ బాంబ్ పేల్చారు. టీమిండియా తొండాట ఆడుతోందని ఆరోపణలు చేసారు. దీంతో నమన్ ధీర్ పట్టిన క్యాచ్ పై ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇరగదీసిన జాన్ క్యాంప్‌బెల్…సెంచరీ నమోదు

టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య గౌహతిలోని బార్సాపరా క్రికెట్ స్టేడియం వేదికగా రెండో వన్డే మధ్యాహ్నం ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఫస్ట్ బ్యాటింగ్ దిగి, భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (John Campbell) సెంచరీ ఫినిష్ చేసి, ఔట్ అయ్యాడు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

68 బంతులు ఎదుర్కొన్న జాన్ క్యాంప్ బెల్ 101 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు, 9 బౌండరీలు సాధించాడు. అటు ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ షై హోప్ అర్థ సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. ఇప్పటి వరకు 171 పరుగులు సాధించిన విండీస్ 2 వికెట్లు కోల్పోయింది. ఇవాల్టి మ్యాచ్ లోనూ 300కు పైగా స్కోర్లు నమోదు అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

నమన్ ధీర్ క్యాచ్ పై ఇంజమామ్ ఫైర్

Advertisement

టీమిండియా యంగ్ క్రికెటర్ నమన్ ధీర్ పట్టిన క్యాచ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బంతి నేలకు తగిలినా, ఔట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. థర్డ్ అంపైర్ టీమిండియాకు అమ్ముడుపోయాడంటూ విమర్శలు చేశారు. అందుకే తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా, రెండో మ్యాచ్ లోనూ గెలుస్తుందని అంచనా వేశారు. భారత గడ్డపై ఏ మ్యాచ్ జరిగినా, ప్రత్యర్థులకు అన్యాయమే జరుగుతుందని బాంబ్ పేల్చారు. ఇక ఇప్పుడు విండీస్ జట్టుకు అదే పరిస్థితి నెలకొనబోతుందని హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

 

Related News

తన్వీర్ అహ్మాద్‌ను మెంటల్ ఆస్పత్రిలో వేయాలి…వాడికి కొంచెం కూడా బుర్రలేదు

దద్దమ్మలను పక్కకు పెట్టి, 2027 వరల్డ్ కప్ కోసం సంజును తీసుకోండి

మీ కాళ్లు పట్టుకుంటా, దయచేసి పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లోకి తీసుకోండి

ముంబై ఇండియన్స్‌లోకి బాబర్ ఆజం…అంబానీపై ట్రోలింగ్ షురూ ?

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

టీమిండియాకు నరకం చూపించైనా 2027 వరల్డ్ కప్ గంభీర్ అందించేలా ఉన్నాడు

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

Big Stories

Advertisement
×