E-Paper
Advertisement

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు,  ఇకపై ఇజ్రాయెల్..
Advertisement

Flydubai Co-Pilot: ప్లై దుబాయ్ విమానం ఘటన వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు విషయాలు తెలియడంతో పలువురు షాకవుతున్నారు. కో-పైలట్‌ హమామ్ అల్హమామిగా గుర్తించిన అధికారులు, అతడి బ్యాక్ గ్రౌండ్ గురించి కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి.

ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు

ప్లై దుబాయ్ కో-పైలట్ హమామ్ అల్మమామి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 1996లో UAEలో సిరియన్ తల్లి-ఒమన్ తండ్రికి జన్మించాడు హమామీ. దీంతో 14 నుంచి 21 ఏళ్ల మధ్య సిరియాలో అతడు ఉన్నట్లు సమాచారం. అక్కడే తీవ్రవాద భావజాలాలను అంది పుచ్చుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిరియాలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు గుర్తించారు. 2018 లో ఒమన్ ఏవియేషన్‌లో చేరాడు హమామీ.

తీగలాగితే డొంక కదిలింది, విచారించేందుకు ఇజ్రాయెల్ రెడీ

Advertisement

2024 లో అతడిపై తీవ్రవాద కంటెంట్‌ గుర్తించడంతో విమానాలు నడపకుండా ఒమన్ నిషేధం విధించింది. 2025లో ఒమన్ ఏవియేషన్‌కు రాజీనామా చేశాడు. 2026లో ఫ్లై దుబాయ్‌లో నేరుగా ఫస్ట్ ఆఫీసర్‌గా చేరాడు. హమామీ గతం, శిక్షణ, సెక్యూరిటీ చెక్స్‌పై దర్యాప్తు కొనసాగుతుంది. కో-పైలట్‌ను ఒమన్ జాతీయుడు హమామ్ అల్-హమ్మామిగా గుర్తించారు. ఈ విషయంపై అవగాహన ఉన్న గల్ఫ్ దౌత్యవేత్త, పాశ్చాత్య దౌత్యవేత్తతో సహా ముగ్గురు వ్యక్తులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. మీడియాతో మాట్లాడటానికి వారికి అధికారం లేనపోవడంతో వారి పేర్లు వెల్లడించవద్దనే షరతుతో మాట్లాడారు.

దూరవిద్యలో ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌ కోర్సు

అల్-హమ్మామి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. అతడు ఫిబ్రవరి, 2025లో వైదొలగడానికి ముందు ఒమాన్ ఎయిర్‌లో ఏడేళ్లు పని చేశాడని పేర్కొంది. జూన్, 2025లో రాయల్ ఎయిర్ మొరాకోలో చేరాడు. ఈ ఏడాది జనవరిలో వైదొలగినట్లు పేర్కొన్నాడు. హమామ్ యూకే విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్లు నిర్ధారించారు. గతంలో ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో దూరవిద్య కోర్సు పూర్తి చేశాడు. విశ్వవిద్యాలయంలో ఎలాంటి పైలట్ శిక్షణ తీసుకోలేదని తెలుస్తోంది.

Advertisement

ALSO READ: భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో

ఫ్లైదుబాయ్ కో-పైలట్ హమామ్.. ఆస్ట్రేలియాలో సుమారు రెండు సంవత్సరాలు విద్యార్థిగా గడిపాడని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. 2014లో అతడికి ఆస్ట్రేలియన్ స్టూడెంట్ వీసా మంజూరైందని, ఆ తర్వాతి ఏడాది యూనివర్సిటీ కోర్సు ప్రారంభించడానికి దేశానికి వచ్చాడని తెలిసింది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, 2017లో ఆస్ట్రేలియాను విడిచిపెట్టాడట. అతడు కోర్సులో నమోదు కాలేదని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత 2019లో అతడి వీసా రద్దు చేసినట్టు అక్కడి అధికారుల మాట.

కో-పైలట్ హమీమ్ సౌదీ అరేబియాలోని టబూక్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం అక్కడి నుంచి ఆయన్ని యూఏఈకి తరలించారు. అక్కడ ఇజ్రాయెల్ అధికారులు అతడ్ని ప్రశ్నించే అవకాశముంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్‌కి చెందిన ఓ టీమ్, యూఏఈకి చేరుకుందని సమాచారం.

Related News

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

ఇది జిహాదీ ఉగ్రదాడే.. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి వార్నింగ్!

Big Stories

Advertisement
×