BigTV English

Maldives row : మా నేతల మాటలు పట్టించుకోకండి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నడపండి..

Maldives row : తమ దేశానికి విమానాల బుకింగ్‌లను తిరిగి తెరవాలని ఈజ్‌మై ట్రిప్‌ సంస్థను మాల్దీవులకు చెందిన టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం కోరింది. లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మై ట్రిప్‌ మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపి వేసిన సంగతి అందరికి తెలిసిందే.

Maldives row : మా నేతల మాటలు పట్టించుకోకండి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నడపండి..

Maldives row : తమ దేశానికి విమాన టిక్కెట్స్ బుకింగ్‌లను తిరిగి తెరవాలని ఈజ్‌మై ట్రిప్‌ సంస్థను మాల్దీవులకు చెందిన టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం కోరింది. లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మై ట్రిప్‌ మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపి వేసిన సంగతి అందరికి తెలిసిందే.


దీనిపై అక్కడి టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం స్పందించింది. తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మై ట్రిప్‌ను కోరింది. ఆ మాటలు మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదని వెల్లడించింది. ఈజ్‌మై ట్రిప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మటాటోకు లేఖ రాసింది. తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని లేఖలో పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని మాల్దీవుల సంస్థ తెలిపింది. భారతీయులను సొంతవారిగా భావిస్తామని వెల్లడించింది. తమ పర్యాటక రంగంలో భారతీయులు అత్యంత కీలకమని తెలిపింది. అయితే మాల్దీవుల నేతల వ్యాఖ్యలను ఆ దేశ పర్యాటక పరిశ్రమ సంఘం ఖండించిన సంగతి తెలిసిందే.


భారత్‌ మాకు స్థిరమైన, కీలక పర్యాటక వనరు అని మాల్దీవుల సంఘం తెలిపింది. కొవిడ్‌ తర్వాత మేం కోలుకోవడానికి ఆ దేశం ఎంతో సాయం చేసిందని తెలియజేసింది. అంతేకాదు.. మా దేశానికి అతి సన్నిహితమైన దేశం భారత్‌ అని తెలిపింది. ప్రతి సంక్షోభంలోనూ ఆ దేశమే తొలి సారిగా స్పందిస్తుంది. అందుకు మేం ఆ దేశానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రకటనలో పేర్కొంది.

ఈ పరిణామాల మధ్య మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, ముందుగానే ఈ పర్యటన ఖరారైనట్లు సమాచారం.

Tags

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×