BigTV English

Russia: పుతిన్‌ హత్యకు డ్రోన్లు.. గాల్లోనే పేల్చేసిన రష్యా.. ఉక్రెయిన్‌కు ‘వార్‌’నింగ్…

Russia: పుతిన్‌ హత్యకు డ్రోన్లు.. గాల్లోనే పేల్చేసిన రష్యా.. ఉక్రెయిన్‌కు ‘వార్‌’నింగ్…


Russia: ఉక్రెయిన్‌పై నెలల తరబడి యుద్ధం చేస్తోంది రష్యా. వార్ దాదాపు వన్‌సైడ్‌గా జరుగుతోంది. ఉక్రెయిన్ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. అయినా, అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉన్నంత కాలం రష్యా గెలిచినట్టు కాదు. అమెరికా ఆయుధ సాయంతో రష్యాన్ వార్‌ను కాస్తైనా డిఫెన్స్ చేయగలుగుతోంది ఉక్రెయిన్. అప్పుడప్పుడు గైడెడ్ మిస్సైల్స్, డ్రోన్లతో రష్యాకు షాక్‌లు కూడా ఇస్తోంది. ఇన్నాళ్లూ ఆయిల్ బావులను పేల్చడం వరకే పరిమితమైన ఆ దేశం.. లేటెస్ట్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్‌నే లేపేసేందుకు ట్రై చేసిందని అంటున్నారు. ఆ మేరకు రష్యా.. ఉక్రెయిన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే….

రష్యా అధ్యక్షుడు పుతిన్. అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ఉండే దేశాధినేత. ఆయన ఉండేది రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో. సడెన్‌గా క్రెమ్లిన్ మీదకు ఓ డ్రోన్ దూసుకొచ్చింది. క్షిపణి రక్షణ వ్యవస్థ వెంటనే గుర్తించి స్పందించింది. ఆ డ్రోన్‌ భవనాన్ని తాకకు ముందే కూల్చేసింది. అంతలోనే మరో డ్రోన్. దాన్నీ గాల్లోనే పేల్చేసింది డిఫెన్స్ సిస్టమ్. ఆ డ్రోన్ల దాడికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర చేసిందని.. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంపై క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడి జరిగిందని రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన రెండు డ్రోన్లను కూల్చివేశామని తెలిపింది. ఈ ఘటనలో పుతిన్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదని.. దాడి సమయంలో ఆయన క్రెమ్లిన్‌లో లేరని.. ఇంటి నుంచి పని చేస్తున్నారని ప్రకటించింది. క్రెమ్లిన్‌ బిల్డిండ్‌కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది.

డ్రోన్ అటాక్ జరిగిన వెంటనే మాస్కోలో ఎమర్జెన్సీ ప్రకటించారు. నగరంలో ఎటువంటి అనధికారిక డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధించారు. మే 9 మాస్కోలో విక్టరీ డే పరేడ్‌ జరగనుండగా.. ఇప్పుడిలా డ్రోన్ దాడి జరగడంతో రష్యా మరింత అలర్ట్ అయింది. ఉక్రెయిన్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, డ్రోన్ అటాక్‌తో తమకెలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ ప్రకటించింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×