E-Paper
Advertisement

Russia Snow Storm: రష్యాలో మంచు తుపాను బీభత్సం.. అపార్ట్మెంట్ ఎత్తులో హిమపాతం

Russia Snow Storm: రష్యాలో మంచు తుపాను బీభత్సం.. అపార్ట్మెంట్ ఎత్తులో హిమపాతం
Advertisement

Russia Snow Storm: రష్యాలో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. కంచట్కా ద్వీపకల్పంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. 130 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ హిమపాతంతో వీధులన్నీ 3 మీటర్ల మేర మంచుతో నిండిపోయాయి. వాహనాలు పూర్తిగా మంచులో కూరుకుపోవడంతో, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మంచు అపార్ట్మెంట్ ఎత్తులో పేరుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. మనుషులు గడ్డకడ్డిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

40 అడుగుల మేర మంచు

రష్యాలోని కంచట్కా పట్టణం పూర్తి మంచులో చిక్కుకుంది. భారీ హిమపాతంతో.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు మంచుతో నిండిపోవడం, నిత్యవసరాల సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కంచట్కాలో కొనసాగుతున్న మంచు తుపాను కారణంగా.. ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక యంత్రాంగం చెబుతోంది. వీధుల్లో 10 నుంచి 40 అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయాయి. అపార్ట్‌మెంట్ల నాల్గో అంతస్తు వరకు మంచులో పేరుకుపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచు తుపాన్- తీవ్ర వాతావరణ పరిస్థితులు

Advertisement

రష్యా తూర్పు ప్రాంతంలోని కంచట్కా ద్వీపకల్పంలో మంచు తుపాను, అగ్నిపర్వతాల పేలుళ్లు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొత్తేమీ కాదు. అయితే, తాజా మంచు తుపాను చారిత్రక హిమపాతాన్ని దాటిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం, రహదారులు పూర్తిగా మూసుకుపోవడం, విమానాలు రద్దు కావడంతో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

అత్యవసర పరిస్థితి ప్రకటన

మంచు తుపాను కారణంగా జనవరి 15న నగరవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ప్రాంతంలో భారీ హిమపాతాలకు ప్రధాన కారణం.. వాయవ్య పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడటం అని వాతావరణ శాఖలు తెలిపాయి. దీని ఫలితంగా బలమైన మంచు గాలులు, భారీగా మంచు కురుస్తుందని తెలుపుతున్నాయి.

Advertisement

Also Read:  ఈ నెలలో వరుసగా 4 రోజుల బ్యాంకు సెలవులు.. ఎందుకంటే?

వీడియోలు వైరల్

ప్రస్తుతం స్కూల్లు, స్థానిక వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రజలు రిమోట్ వర్కింగ్ కు మారాల్సి వచ్చింది. రోడ్లు మూసుకుపోవడంతో.. రవాణా స్తంభించి.. దుకాణాలలో బ్రెడ్, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలు కూడా అయిపోతున్నాయి. సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియోల్లో ఏడు అడుగుల కంటే ఎక్కువ మంచు కింద కార్లు కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×