T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026) నెల రోజుల సమయం కూడా లేదన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ( Pakistan ) ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా, బీసీసీఐపై కుట్రలు చేద్దామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ప్లాన్ వేస్తున్న నేపథ్యంలో వాళ్ల జట్టుకు చుక్కెదురు అయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి హారిస్ రవూఫ్ అలాగే బాబర్ ఆజం ఇద్దరూ దూరంగా కాబోతున్నారట. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగబోతుందట పాకిస్తాన్ జట్టు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026) సంబంధించిన ఫైనల్ జట్టును ఇంకా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీలోపు అన్ని జట్లు తమ ప్లేయర్ల లిస్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, త్వరలోనే పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ జట్టుకు సల్మాన్ అఘా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మహమ్మద్ రిజ్వాన్ కు కూడా ఈ జట్టులో చోటు దక్కనుంది. అటు షాహీన్ అఫ్రిదికి వైస్ కెప్టెన్సీ ఇస్తారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్ ఆజం అలాగే హారిస్ రవూఫ్ ( HARIS RAUF) లాంటి స్టార్ ప్లేయర్లు ఈ మెగా టోర్నమెంట్ కు దూరం అవుతారట.
బిగ్ బాస్ లీగ్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న హారిస్ రవూఫ్… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అటు 2024 నుంచి ఎక్కడ కూడా పెద్దగా రాణించలేదు మాజీ సారధి బాబర్ ఆజం ( BABAR AZAM). వరుసగా ఫ్లాఫ్ అవుతూ వస్తున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నప్పటికీ కూడా.. పెద్దగా రాణించడం లేదు. ఈ కారణాల వల్ల ఈ ఇద్దరు ప్లేయర్లు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్ లు పాకిస్తాన్ లో పెట్టాలని బంగ్లా కోరుతోంది. దీనికి ఐసీసీ ఒప్పుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐని ఇరికించాలని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్రకు తెరలేపింది. బంగ్లాదేశ్ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే, మేం కూడా టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇస్తోంది పాకిస్తాన్. ఇలాంటి నేపథ్యంలోనే బాబర్, హారిస్ జట్టుకు దూరం కాబోతున్నారని వార్త బయటకు వచ్చింది. దీంతో దేవుడు ఉన్నాడురా అంటూ మన ఇండియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయర్ మెడ పట్టుకుని తోసేసిన కోహ్లీ..బంతిని తన్ని మరీ రెచ్చిపోయాడుగా
HARIS RAUF AND BABAR AZAM TO MISS T20 WC 🚨
– Haris Rauf & Babar Azam are likely to miss out on the T20 World Cup squad 😨
– Haris Rauf has a good BBL, but his form in the Asia Cup was poor; meanwhile, Babar Azam has struggled since the start of 2024 🧐 pic.twitter.com/dS2fzhwp48
— Richard Kettleborough (@RichKettle07) January 19, 2026