E-Paper
Advertisement

Thriller Movies OTT : నిమిషానికో ట్విస్ట్… నరాలు కట్టయ్యే సస్పెన్స్… మెంటలెక్కించే బెస్ట్ సౌత్ థ్రిల్లర్స్

Thriller Movies OTT : నిమిషానికో ట్విస్ట్… నరాలు కట్టయ్యే సస్పెన్స్… మెంటలెక్కించే బెస్ట్ సౌత్ థ్రిల్లర్స్
Advertisement

Thriller Movies OTT : నార్త్ తో పోలిస్తే థ్రిల్లర్ సినిమాలకు అడ్డాగా సౌత్ ఇండస్ట్రీ టాప్ లో ఉందనే చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను కూడా సౌత్ థ్రిల్లర్ సినిమాలపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. ఆకట్టుకునే కథలు, అద్భుతమైన దర్శకత్వంతో, ఈ సినిమాలు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మనం అలాంటి టాప్ సౌత్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

‘సుక్ష్మదర్శిని’

అత్యంత ఉత్కంఠభరితమైన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ ‘సూక్ష్మ దర్శిని’సినిమా. గ్రేసీ అనే మహిళ కనిపించకుండా పోయినప్పుడు, పొరుగున ఉన్న ప్రియదర్శిని పక్క ఇంట్లో ఉన్న ఇమాన్యుయెల్ అనే వ్యక్తిని అనుమానిస్తుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇది ఐయండిబిలో 7.8 రేటింగ్‌ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

Advertisement

జిత్తు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక పోలీసు అధికారి దర్యాప్తు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఒక దొంగ బంగారం కేసుకు సంబంధించిన విచారణ చేపట్టినప్పుడు, అది ఒక ప్రమాదకరమైన నేర సామ్రాజ్యాన్ని ఎలా బయటపెట్టిందనేదే ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి ఐయండిబిలో 7.5 రేటింగ్ ఉంది.

‘ఇరట్ట’

2023 మలయాళ చిత్రం “ఇరట్ట”ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఇందులో కవల సోదరులుగా జోజు జార్జ్ నటించారు. ఈ ఎమోషన్ క్రైమ్ థ్రిల్లర్ IMDbలో 10కి 7.7 రేటింగ్‌ను కలిగి ఉంది.

‘దృశ్యం’

Advertisement

సౌత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ మూవీ “దృశ్యం”. ఈ చిత్రం ఒక విషాదకరమైన ప్రమాదం తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడే కేబుల్ టీవీ ఆపరేటర్ కథను చెబుతుంది. ఈ కథ ఉత్కంఠభరితమైన రీతిలో సాగుతుంది. రెండు భాగాలు ఇప్పటికే విడుదలయ్యాయి. మూడవ భాగం 2026లో విడుదల కానుంది. రెండు భాగాలు 8.4 రేటింగ్‌ను పొందాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘కట్టపుత్లీ’

జియో హాట్‌స్టార్‌లో 8.3 రేటింగ్ ఉన్న తమిళ మూవీ “రాట్చసన్” కు బాలీవుడ్ రీమేక్ గా వచ్చిందే “కట్టపుత్లీ”. స్కూల్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే సీరియల్ కిల్లర్‌ను వేటాడే ఒక పోలీస్ చుట్టూ కథ తిరుగుతుంది.

‘విక్రమ్ వేద’

2017లో విడుదలైన “విక్రమ్ వేద” సినిమా SunNxtలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి, శ్రద్ధా శ్రీనాథ్, కతీర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విక్రమ్ అనే పోలీసు ఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతను వేదా అనే గ్యాంగ్ స్టర్ ను కనిపెట్టి, చంపడానికి బయలుదేరుతాడు. ఆతరువాత వేదం స్వచ్ఛందంగా తనను తాను లొంగిపోయిన తరువాత ఈ కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ పొందింది.

Read Also : ఈ వారం ఓటీటీలో తమిళ సినిమాల సందడి… ఆ రెండూ డోంట్ మిస్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×