BigTV English

Vladimir Putin : అమెరికాకు సాయం చేసేందుకు పుతిన్ సిద్ధం – బలపడుతున్న రష్యా-అమెరికా బంధం

Vladimir Putin : అమెరికాకు సాయం చేసేందుకు పుతిన్ సిద్ధం – బలపడుతున్న రష్యా-అమెరికా బంధం

Vladimir Putin : దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా-రష్యా బంధంలో ఇటీవల కాలంలో అనుకోని మార్పులు, చర్చలు చూస్తున్నాం. ఇప్పటికే.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఇంటర్నేషనల్ మీడియా ముందే రష్యా ముందు మీరు గెలవలేరు, సంధి చేసుకోండి అంటూ ప్రకటించిన ట్రంప్.. జెలెన్స్కీ కంటే పుతిన్ నయం అంటూ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు కార్యక్రమాలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న వాషింగ్టన్ .. ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. వీటిపై చర్చిద్దామని అనేక సార్లు ఇరాన్ కోరుతోంది. ఈ రెండు దేశాల మధ్య చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే విషయం అధికారికంగా ప్రకటిస్తే.. రష్యా-యూఎస్ సంబంధాల్లో ట్రంప్ పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిగా మిగిలిపోతారు.


ఇస్లామిక్ రిపబ్లిక్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ టెర్రరిజానికి మద్ధతు ఇవ్వడం వంటి అంశాలపై ట్రంప్ యంత్రాంగం ఆగ్రహంగా ఉంది. దీంతో.. ఇరాన్ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసేందుకు అందుబాటులోని అన్ని మార్గాల్లో ఇరాన్ ను ఇబ్బంది పెడుతోంది. కాగా.. ఈ రెండు దేశాలు చర్చల ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని భావిస్తే.. మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లుగా బ్లూమ్ బెర్గ్ ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. గత నెలలో పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ఈ ప్రపోజల్ చేశారని, దానికి పుతిన్ అంగీకరించినట్లుగా వెల్లడించింది.

కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలో అమెరికా-రష్యా అధికారులు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించే విషయమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్‌తో చర్చలకు రష్యా మధ్యవర్తిత్వం వహించే అంశాన్ని అమెరికా అధికారులు లేవనెత్తినట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రమాదకర ఇస్లామికి టెర్రరిస్టుల్ని తయారు చేస్తూ, వారిని ప్రపంచం పైకి వదులుతున్న ఇరాన్ పై అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు వారాల్లోనే తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇరాన్‌కు అణ్వాయుధ తయారీకి ఉన్న అన్ని మార్గాలను మూసేశారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని అధ్యక్షుడు ట్రంప్ సహించరని, ముఖ్యంగా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వారి నిరంతర ఉగ్రవాద కార్యకలపాల్ని ఆయన సమర్థించరు అంటూ ఫిబ్రవరిలో వైట్ హౌస్ ప్రకటించింది.


ఇరాన్ పై ఒత్తిడిలో భాగంగా.. దాని చమురు ఎగుమతులను సున్నాకి తీసుకురావడమే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా..ఇరాన్ నుంచి రహస్యంగా చమురు సరఫరాకు సాయం చేస్తున్న షాడో ఫ్లీట్‌పై అదనపు ఆంక్షలు విధించింది. ఇరాన్ పెట్రోలియం సంబంధిత ఉత్పత్తులను విక్రయించకుండా, రవాణా చేయకుండా చూసేందుకు ప్రత్యేక దళాల్ని నియమించింది. ఓ వైపు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూనే.. మరోవైపు.. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు .

Also Read : Sunita Williams : భూమి మీదకు ఎప్పుడొస్తామో తెలియదు – సునీత విలియమ్స్ సన్సెషనల్ కామెంట్స్

ఇరాన్ శాంతియుతంగా అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించేలా అణు శాంతి ఒప్పందం ఉండాలని, అలాంటి దానికే తన మద్ధతు ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంపై తర్వగా పని చేయాలని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడికి ప్రయత్నాలు ప్రారంభించిన మరుసటి రోజే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు రష్యా మధ్యవర్తిత్వం వహించడం, లేదా సహాయం చేసే అవకాశం గురించి క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. అమెరికా-ఇరాన్ అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రష్యా విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిని సాధించేందుకు రష్యా తన శక్తి మేరకు ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×