BigTV English

Santa Claus Origin : శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది

Santa Claus Origin : శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది

Santa Claus Origin | క్రిస్మస్ వచ్చేసింది. పిల్లలంతా రాత్రిపూట శాంతా క్లాజ్ వచ్చి తమకు బహుమతులు ఇస్తారని తెగ ఆశ పడుతుంటారు. ‘శాంతా ఎక్కడ ఉంటారు?’ అని తల్లిదండ్రులపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అడ్రస్ చెప్తే తమకు ఎలాంటి గిఫ్ట్ కావాలో లెటర్ రాస్తామంటూ తెగ విసిగించేస్తారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. శాతా మా దేశం వాడంటే, మా దేశం వాడని చాలా దేశాలు గొడవ పడుతుంటాయి. ఫిన్లాండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ అయితే తమ దేశంలోని లాప్‌ల్యాండ్‌లో ఉన్న కోర్వాంతటూరి అనే ప్రాంతంలోనే శాంతా వర్క్‌షాప్‌ ఉందని ప్రచారం చేస్తోంది. ఈ ఒక్క మాటతో ఆ దేశానికి క్రిస్మస్ సమయంలో లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు.


డెన్మార్క్‌కు చెందిన ప్రజలేమో శాంతా ఉండేది గ్రీన్‌ల్యాండ్‌లో అని అంటారు. స్వీడన్ ఏమో తన దేశంలోని మోరాలో శాంతా ఉంటాడంటూ.. అక్కడ శాంతావరల్డ్ అనే థీమ్‌పార్క్‌ను కూడా నిర్మించింది. ఈ ప్రాంతాలన్నీ క్రిస్మస్ సమయంలో ఫుల్లుగా మంచుతో కప్పేసి ఉంటాయి. దానికితోడు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటాయి. దాంతో ఇవన్నీ నమ్మశక్యంగానే ఉంటాయి.

శాంతా వెనుక కథలన్నీ అందంగా లేవు..
ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని, పిల్లలకు బహుమతులు ఇచ్చే శాంతా క్లాజ్ వెనుక ఉన్న జానపద కథలు అంత గొప్పవేం కావు. ఫిన్‌ల్యాండ్‌లో ఉండే పేదవాళ్లు జనవరి సమయంలో సెయింట్ నాట్స్ డేని జరుపుకునేవారు. మంచి ఊలుతో తయారు చేసిన జాకెట్లు ధరించిన వ్యక్తులు.. అందరి ఇళ్లకు వెళ్లి బహుమతులు అడిగేవారు. ఇది వాళ్ల పురాతన నుట్టి పుక్కి (ఫిన్ ల్యాండ్ పదం) సంప్రదాయం. ఎవరైనా తమకు బహుమతులు ఇవ్వకపోతే ఆ కుటుంబాలను నుట్టిపుక్కిలు బూతులు తిట్టి, శాపాలు పెట్టేవని అక్కడి ప్రజలు నమ్మేవారు. వాళ్లను చూస్తేనే కొంతమంది చిన్నారులు గుక్కపట్టేవారట. కాలక్రమేణా ఇలా గిఫ్ట్స్ తీసుకునే నుట్టిపుక్కీ సంప్రదాయానికి స్వస్తి పలికిన అక్కడి ప్రజలు.. మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకు బహుమతులు ఇచ్చే జౌలుపుక్కీ సంప్రదాయాన్ని అలవరుచుకున్నారు. ఇది ‘యూల్ లాడ్స్ ఆఫ్ ఐస్‌ల్యాండ్’ సంప్రదాయాన్ని పోలి ఉండేది.


అంతేకాదు, శాంతా క్లాజ్ ఎలా ఉంటాడనే దానిపై కూడా చాలా చర్చ జరిగింది. 19వ శతాబ్దంలోనే ఇప్పుడు అందరూ అనుకునే ఎర్ర డ్రెస్, చిన్నపిల్లలకు నచ్చే నవ్వు, మంచు దుప్పులు లాగే వాహనం, ఉత్తర ధ్రువంలో ఉండే వృద్ధుడు.. వంటి అంశాలన్నీ శాంతాక్లాజ్ కథలో చేరాయి. దీంతో అంతకుముందు ఇలా బహుమతులు ఇచ్చే ఎల్ఫ్స్ (కొన్ని రకాల వన దేవతలు), మరుగుజ్జులు, యక్షులు వంటి కథలకు శాంతా కథతో తెరపడింది. ఆ తరువాత యూరోపియన్ జానపదాల్లో ఉన్న ఆ జీవుల కథలు నెమ్మదిగా అంతరించాయి.

Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం

అయితే శాంతా ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అనే విషయాలపై ఒక క్లారిటీ రావడానికి మాత్రం 19వ శతాబ్దం మధ్య వరకు ఆగాల్సి వచ్చింది. అప్పటి ప్రముఖ చిత్రకారుడు థామస్ నాస్ట్.. తొలిసారి హార్పర్స్ వీక్లీలో శాంతాను ఇప్పుడు మనం అందరం చూస్తున్న రూపంలో చిత్రీకరించాడు. ఈ చిత్రంలోనే శాంతాను మంచుకొండల్లో ఉన్నట్లు ఆయన చిత్రించాడు. అది ఉత్తర ధ్రువమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అయితే 1866 సమయాని ఆ ధ్రువానికి వెళ్లలేదు. దీంతో అందరూ శాంతా అక్కడే ఉండేవారని అనుకున్నారు.

శాంతా కోసం గొడవలు..
శాంతా మావాడంటే.. మావాడంటూ చాలా దేశాలు గొడవ పడుతున్నాయి. అయితే ఫిన్లాండ్, స్కాండినేవియాలోని పురాతన జానపద గాధల్లో శాంతా వంటి వ్యక్తి ప్రస్తావన ఉంది. దాంతో ఆ దేశాలు శాంతా తమ వాడే అనడంలో కొంతం న్యాయం ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే మిగతా దేశాలు ఇంకో అడుగు ముందుకేసి, శాంతా తమ వాడే అని నిరూపించుకోవడానికి కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా అయితే క్రిస్మస్ సమయంలో శాంతా తమ దేశ ఎయిర్ స్పేస్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తూ చట్టం కూడా చేసింది. ఇక 2013లో ఆ దేశంలో స్టీఫెన్ హార్పర్ నేతృత్వంలోని కన్వర్జేటివ్ పార్టీ.. ఇంకో అడుగు ముందుకేసింది. శాంతాకు, ఆయన భార్యకు కెనడా పాస్‌పోర్టులు జారీ చేసింది. ఇదంతా పిల్లల కోసం చేసినట్లే కనిపిస్తున్నా.. దీని వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉంది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఉత్తర ధ్రువం ఎవరిదనే విషయంపై ప్రపంచంలో ఒక ఒప్పందం లేదు. అందుకే చాలా దేశాలు ఉత్తర ధ్రువం తమ భూభాగమేనని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగంగానే శాంతా తమవాడంటే.. ఉత్తర ధ్రువం కూడా తమదేనని చెప్పుకోవచ్చని కెనడా ప్లాన్ అన్నమాట.

శాంతా అసలు పేరు నికోలస్ ?
ప్రస్తుత టర్కీలో ఇజ్మీర్ అనే ప్రాంతాన్ని చరిత్రలో స్మిర్నా అనేవారు. అలాగే ఇప్పటి డెమ్రేని మైరా అనేవారు. ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రముఖ క్రిస్టియన్ బిషప్ సెయింట్ నికోలస్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. ఆయన పేరే కాలక్రమంలో శాంతా క్లాజ్‌గా మారిందని కొందరి వాదన. అందుకే ఐరోపాలో లాగే, టర్కీలో కూడా శాంతా తమవాడే అని వాదించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీనికి ఒక పెద్ద కారణమే ఉంది. అదేంటంటే.. సెయింట్ నికోలస్‌కు నావికులు, పిల్లలతో చాలా మంచి అనుబంధం ఉండేది. ఆయన చిన్నపిల్లలు ఎప్పుడు కనిపించినా ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడని చరిత్ర చెప్తోంది. అదే సమయంలో నావికులు ఆయన గురించి తాము వెళ్లిన వేరే దేశాల్లో కథలుగా చెప్పడంతో అక్కడ కూడా ఈ కథ బాగా ప్రసిద్ధి చెందిందని అంటారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×