BigTV English

Subhanshu Shukla: తిరుగు ప్రయాణంలో శుభాన్షు.. సారే జహాసే అచ్చా అంటూ సందేశం

Subhanshu Shukla: తిరుగు ప్రయాణంలో శుభాన్షు.. సారే జహాసే అచ్చా అంటూ సందేశం

భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. రేపు(సోమవారం) ఉదయం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మంగళవారం వారి వాహక నౌక భూమిని చేరుతుంది. భూమిపైకి తిరిగి వచ్చే క్రమంలో శుభాన్షు శుక్లా సందేశం ఆసక్తికరంగా ఉంది. సారే జహాసే అచ్చా అంటూ ఆయన తన సందేశాన్ని పంపించారు. 1984లో భారతీయ తొలి వ్యోమగామి రాకేష్ శర్మ కూడా అంతరిక్షం నుంచి ఇవే పదాలు చెప్పారు. ఆయన చెప్పిన సందేశాన్ని ఇప్పుడు శుభాన్షు శుక్లా రిపీట్ చేయడం విశేషం. అంతే కాదు.. “ఆజ్ కా భారత్ స్పేస్ సే నిదార్, గర్వ్ సే పూర్ణ్ దిఖ్తా హై”, అని చెప్పారు. అంటే అంతరిక్షం నుంచి భారతదేశం నమ్మకంగా, నిర్భయంగా కనిపిస్తోంది అని అర్థం.


అన్ డాకింగ్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో రెండు వారాలు శుభాన్షు శుక్లా బృందం వివిధ ప్రయోగాలు చేసింది. ఆక్సియం-4 మిషన్ పూర్తి కావడంతో వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన ఆక్సియం-4 మిషన్, డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఈ బృందం ISS కు చేరుకుంది. జూన్ 26న ISSతో ఈ మిషన్ ని డాకింగ్ చేశారు. ఇప్పుడు అన్ డాకింగ్ నిర్వహించినజులై 14న ఉదయం 7.05 గంటలకు వాహక నౌక ISS నుంచి తిరగు ప్రయాణం మొదలు పెడుతుంది. జులై 15న కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తారు. శుభాన్షు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్‌ కపు.. వీరంతా ఒకేసారి అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్నారు.

అంతరిక్షంలో పార్టీ..
ఆక్సియం-4 మిషన్ ముగింపు దశ సందర్భంగా అంతరిక్షంలో చిన్నపాటి పార్టీ చేసుకున్నారు వ్యోమగాములు. ఆరు దేశాలకు ప్రాతినిధ్యం వహించే మెనూతో విందు జరిగింది. ప్రస్తుతం, ISSలో 11 మంది వ్యోమగాములు ఉండగా.. ఆక్సియం-4 మిషన్ ద్వారా వెళ్లిన నలుగురు తిరిగి వచ్చేస్తున్నారు. మిగతావారు అక్కడే ఉంటారు. వారు మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తారు. భారత్ నుంచి వెళ్లిన శుభాన్షు శుక్లా బృందం తమ పర్యటనను విజయవంతం చేసుకుని తిరిగి వస్తోంది.


అధికారిక వీడ్కోలు కార్యక్రమంలో వ్యోమగాములు వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. ఆక్సియం-4 మిషన్ విజయాన్ని శుభాన్షు ప్రశంసించారు. తనకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అని అన్నారాయన. తన బృంద సభ్యుల సహకారంతో ఈ ప్రయాణం అద్భుతంగా ఉందని చెప్పారు. “ఇక్కడ ఉండటం, మీలాంటి నిపుణులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని వారితో తన అనుభవాలను పంచుకున్నారు. “ఇదంతా ఒక మాయలా ఉంది. నాకు మద్దతు ఇచ్చిన నా దేశానికి, నా దేశ పౌరులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మిషన్ విజయవంతం కావడానికి అన్ని రకాల మద్దతు అదించిన ఇస్రో, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, నాసా, ఆక్సియం.. వారి భాగస్వాములకు కృతజ్ఞతలు” అని చెప్పారు శుభాన్షు శుక్లా.

Related News

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×