Elephant video: ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ వీడియోలను సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు. ఇటీవల కాలంలో పాముల వీడియోలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరల్ వీడియోలు చూసేందుకు నెటిజన్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఓ అద్భుతమైన తల్లి, పిల్ల ఏనుగులకు సంబంధించిన ఓ అద్భుతమై వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
?utm_source=ig_web_copy_link
ఈ వీడియో షెల్ట్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సంఘటన కెన్యా దేశంలో చోటుచేసుకుంది. ఇందులో ఓ చిన్న ఏనుగు బురద నీటి స్నానం చేస్తూ ఆనందిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ 48 సెకన్ల వీడియో క్లిప్ లో కొర్బెస్సా అనే చిన్న ఏనుగు బురద స్నానాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, తన శరీరాన్ని తల నుంచి తోక వరకు బురదతో కప్పుకుంటూ కనిపిస్తుంది. కొర్బెస్సా అనే చిన్న ఏనుగుతో ఓ ఆడ ఏనుగు కూడా ఉంది. ఈ రెండు ఏనుగులో బురద నీటిలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టు వీడియో కనిపిస్తుంది.
ALSO READ: Watch Video: ఐఏఎస్ ఆఫీసరై ఉండి.. స్టూడెంట్‌తో దారుణ ప్రవర్తన, వీడియో వైరల్
ఈ వీడియోలో బురద నీటిలో స్నానం కేవలం ఆట కోసం మాత్రమే కాదు. ఏనుగులకు ఇది అవసరమైన కార్యకలాపం అని చెప్పవచ్చు. బురద స్నానం వేడి నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే సున్నితమైన చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడుతుంది. కీటకాల దాడిని నివారిస్తుంది. చిన్న ఏనుగులకు, ఈ బురదలో ఆడటం వల్ల వాటి ఏనుగుల మధ్య ఉండే బంధాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. కొర్బెస్సా బురదలో దొర్లుతూ, ఆనందంగా కదులుతున్న వీడియోలో కనబడుతోంది. తన సహజమైన ఆటవిధానాన్ని చూపిస్తుంది. ఇది నెటిజన్ల హృదయాలను ఆకర్షిస్తుంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. వేలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘ఈ వీడియో అద్భుతంగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియో ఏనుగుల బుద్ధిశక్తి అలాగే ఆనందకరమైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలను ప్రశంసిస్తుంది. ఈ చిన్న ఏనుగు ఆటలు, ఆనందం సరళమైన విషయాల్లో ఉంటుందని గుర్తు చేస్తాయి, మనలో చాలా మంది ఈ చిన్న గజరాజు అమాయకత్వానికి ఆకర్షితులవుతారు.