BigTV English

OTT Movie : భూగర్భంలో నీడల్లాంటి మనుషులు… రూపాన్ని దోచేసే రాక్షసులు… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్లు

OTT Movie : భూగర్భంలో నీడల్లాంటి మనుషులు… రూపాన్ని దోచేసే రాక్షసులు… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్లు

OTT Movie : సైన్స్ ఫిక్షన్ ను సైకలాజికల్ హర్రర్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. కానీ ఇలాంటి కాంబినేషన్ ఓ హాలీవుడ్ డైరెక్టర్ సినిమా కూడా తీశారు. మరి ఈ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ ఏంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా పేరు ‘Us’. 2019లో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ అండ్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు జోర్డాన్ పీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఒక కుటుంబం తమ డాపిల్‌ గ్యాంగర్స్ (ఒకేలా కనిపించే కాపీలు) నుండి ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులను చూడొచ్చు. ఇది హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, సోషల్ కామెంటరీ కలగలిసిన సినిమా. ఈ సినిమా భయం, హాస్యం, ఆలోచింపజేసే ట్విస్ట్‌లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా దాని షాకింగ్ ముగింపు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
1986లో యంగ్ అడిలైడ్ (మాడిసన్ కర్రీ) తన తల్లిదండ్రులతో సాంటా క్రజ్ బీచ్‌లో సెలవులను ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక ఫన్‌ హౌస్‌ లోని అద్దాల గదిలోకి వెళ్లి, అచ్చం తమ ఫ్యామిలీ లాగే కనిపించే డాపిల్‌ గ్యాంగర్‌ను చూస్తుంది. ఆ భయంకరమైన సంఘటన తర్వాత, ఆమె మాట్లాడలేకపోతుంది. థెరపీ అవసరమవుతుంది.


2019లో పెద్దయిన అడిలైడ్ (లూపిటా నియోంగ్‌ఓ) తన భర్త గేబ్ (విన్‌స్టన్ డ్యూక్), పిల్లలు జోరా (షహాదీ రైట్ జోసెఫ్), జాసన్ (ఇవాన్ అలెక్స్)తో సాంటా క్రజ్‌లోని తన చిన్ననాటి ఇంటికి సెలవుల కోసం వస్తుంది. గతం కారణంగా అడిలైడ్ ఆ స్థలం గురించి భయపడుతుంది. కానీ గేబ్ ఆమె భయాన్ని పట్టించుకోకుండా, వారి స్నేహితులు టైలర్స్ (ఎలిసబెత్ మాస్, టిమ్ హైడెకర్)తో బీచ్‌కు వెళ్తారు. బీచ్‌లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అడిలైడ్‌కు ఏదో చెడు జరగబోతుందని అనిపిస్తుంది.

ఆరోజు రాత్రి, వారి ఇంటి డ్రైవ్‌వేలో నలుగురు వ్యక్తులు చేతులు పట్టుకుని నిలబడి ఉంటారు. వారు విల్సన్ కుటుంబం డాపిల్‌ గ్యాంగర్స్ రెడ్ (అడిలైడ్), అబ్రహం (గేబ్), ఉంబ్రే (జోరా), ప్లూటో (జాసన్). ఈ డాపిల్‌ గ్యాంగర్స్ అచ్చం చూడడానికి ఆ ఫ్యామిలీ లాగే ఉన్నా, భయంకరంగా, జంతువులలాగా ప్రవర్తిస్తారు. రెడ్ ఒక్కతే మాట్లాడగల ఏకైక డాపిల్‌ గ్యాంగర్. తాము “టెదర్డ్” అని, ప్రభుత్వం సృష్టించిన క్లోన్స్ అని, భూగర్భంలో బాధపడుతూ, ఇప్పుడు తమ వాస్తవ సెల్ఫ్‌లను చంపి స్వేచ్ఛ పొందాలని చూస్తున్నట్టు చెబుతుంది.

Read Also : మహిళలపై అఘాయిత్యం చేసి అమ్మేసే గ్యాంగ్… ఐఎండీబీలో 8.0 రేటింగ్

దీంతో విల్సన్ కుటుంబం టైలర్స్ ఇంటికి పారిపోతుంది, కానీ అక్కడ కూడా డాపిల్‌ గ్యాంగర్స్ దాడి చేస్తారు. అడిలైడ్ రెడ్‌ను ఎదుర్కొని, ఆమె గతంలో ఒక షాకింగ్ రహస్యాన్ని తెలుసుకుంటుంది: ఆ ట్విస్ట్ ఏంటంటే 1986లో అడిలైడ్, రెడ్ స్థలాలు మారాయి. అంటే అడిలైడ్ నిజానికి టెదర్డ్, రెడ్ నిజమైన అడిలైడ్. చివరగా కథ ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×