BigTV English

South Korea | స్వలింగ సంపర్కుల హక్కులకు ఆమోదం తెలిపిన కొరియా సుప్రీం కోర్టు.. ఇదే ఫైనల్!

South Korea | స్వలింగ సంపర్కుల హక్కులకు ఆమోదం తెలిపిన కొరియా సుప్రీం కోర్టు.. ఇదే ఫైనల్!

South Korea | దక్షిణ కొరియా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కులకు అందరితో సమానంగా ఆరోగ్య బీమా హక్కులున్నాని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ తీర్పు ఫైనల్ అని ఇక చర్చలు అనవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పట్ల కొరియా మానవ హక్కుల సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ తీర్పు కొరియా చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.


కొరియాలోని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గే దంపతులు తీసుకున్న పాలసీని రిజెక్ట్ చేసింది. అందులో స్పౌస్ (భార్య లేదా భర్త) ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ దంపతులకు వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీ వాదన. గే దంపతులైన సో సియోంగ్ వూక్, కిమ్ యోంగ్ మిన్ ఇద్దరు పురుషులలో కిమ్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్నాడు. అయితే ఈ పాలసీలో ఉన్న స్పౌస్ (భార్య లేదా భర్త) ఇన్సూరెన్స్ డిపెండెంట్ కవరేజ్ కిమ్ పార్టనర్ సో సియోంగ్‌ కు వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీని రిజెక్ట్ చేసింది.

Also Read: ట్రంప్ తో పోటీపడి గెలిచే చాన్సులు తగ్గిపోతున్నాయి.. బైడెన్‌కు ఒబామా హెచ్చరిక!


ఈ విషయంపై సో సియోంగ్ న్యాయ పోరాటం చేశాడు. కానీ 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు.. ఇన్సూరెన్స్ కంపెనీ వాదనే కరెక్ట్ అని తీర్పు చెప్పింది. దీంతో సో సియోంగ్ ఫిబ్రవరి 2023లో సియోల్ హై కోర్టులో.. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ వేశాడు. కింది కోర్టు తీర్పు సరైనది కాదని.. ఆరోగ్య బీమా విషయంలో స్వలింగ సంపర్కలను విడిగా చూడడం తప్పు అని హైకోర్టు తీర్పు వెలువరించింది.

హై కోర్టు తీర్పుని ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసుని మళ్లీ మొదటి నుంచి విచారణ చేసిన కొరియా సుప్రీం కోర్టు స్వలింగ దంపతులకు కూడా సాధారణ భార్యా భర్తల లాగే ఆరోగ్య బీమా పొందే హక్కులున్నాయని.. వారికి బీమా నిరాకరించడం సమానత్వ హక్కుల ఉల్లంఘన అని చెప్పింది

కొరియాలో ఇప్పటివరకు స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరంగా గుర్తింపు లభించలేదు. అలాంటి దేశ సప్రీం కోర్టు స్వలింగ దంపతులకు అనుకూలంగ తీర్పు చెప్పడం చాలా పెద్ద విషయం. సౌత్ కొరియాలో ట్రాన్స్ జెండర్స్, స్వలింగ సంపర్కులకు ప్రజలు దూరంగా ఉంటారు. వారిని ఇష్టపడరు. అయితే గత కొన్న సంవత్సరాలలో ఈ ఆలోచనా విధానంలో కొంత మార్పు కనిపిస్తోంది.

సుప్రీం కోర్టు తీర్పుపై గే దంపతులలో ఒకరు కిమ్ యోంగ్ మిన్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ” మా కేసులో కోర్టు తీర్పు చదువుతున్నప్పుడు, నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నా కళ్లలో నీళ్లు వచ్చాయి. మా నిజమైన ప్రేమను కోర్టు గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ” అని చెప్పాడు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×