E-Paper
Advertisement

South Korea : మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధించండి.. మార్షల్ లా కేసులో వాదనలు

South Korea : మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధించండి.. మార్షల్ లా కేసులో వాదనలు
Advertisement

South Korea : సైనికపాలన విధించిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సైనిక పాలన కేసులో దోషిగా తేలితే యూన్ కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. సియోల్‌లోని ఒక కోర్టులో యూన్ వచ్చిన అభియోగాలపై వాదనలు ముగిశాయి. పిటిషన్లు యూన్ “తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు” అని ఆరోపించారు.

యూన్ అభిశంసన

డిసెంబర్ 2024లో దక్షిణ కొరియాలో సైనిక పాలన విధించడానికి యూన్ ప్రయత్నించారు. అయితే సైనిక పాలన విధించిన గంటల్లోనే దానిని ఉపసంహరించుకున్నారు. ఇది రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత యూన్ అభిశంసన ఎదుర్కొన్నారు. యూన్ తనపై వచ్చిన అభియోగాలను తిరస్కరించారు. ప్రత్యర్థి పార్టీల తప్పులపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మార్షల్ లా ఒక సంకేతమని వాదించారు.

30 ఏళ్లలో

Advertisement

మాజీ అధ్యక్షుడు యూన్ పై తిరుగుబాటుకు నాయకత్వం వహించారని అత్యంత తీవ్రమైన అభియోగం నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే అతడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. దక్షిణ కొరియాలో గత 30 సంవత్సరాలుగా ఎవరినీ ఉరితీయలేదు. 1996లో, మాజీ సైనిక నియంత చున్ డూ-హ్వాన్‌కు 1979లో సైనిక తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న నేరం కింద మరణశిక్ష విధించారు. అయితే అతని శిక్షను ఆ తరువాత జీవిత ఖైదుగా మార్చారు.

సైనిక చర్య

యూన్ కేసులోని ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపిస్తూ.. సైనిక చర్యలో ఎవరూ మృతి చెందినప్పటికీ.. అతడి ఉద్దేశం హింసాత్మమని వాదిస్తున్నారు.
యూన్ చట్టసభ సభ్యులను అరెస్టు చేయాలని ఆదేశించారని, సైనిక కమాండర్‌ సాక్ష్యాన్ని కోర్టుకు అందించారు. మార్షల్ లా ప్లాన్ లో భాగమైన మాజీ సైనిక అధికారి జారీ చేసిన మెమోను కోర్టుకు సమర్పించారు.

మరణ శిక్ష విధించడం

Advertisement

మార్షల్ లా కేసులో యూన్ తో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్, మాజీ పోలీసు చీఫ్ చో జి-హో ఉన్నారు. ఈ కేసులో యూన్, ఇతర నిందితులు దోషులుగా తేలితే.. మరణ శిక్ష విధించడంపై వాదనలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ కేసులో నేర విచారణను ఎదుర్కొంటున్నందున యూన్ నెలల తరబడి జైలు శిక్ష అనుభవించారు. న్యాయాన్ని అడ్డుకోవడం, మార్షల్ లా ప్రయత్నానికి సంబంధించి యూన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.

Also Read: అభిశంసనకు గురైన ప్రెసిడెంట్.. అయినా జీతం పెంచారు!

మార్షల్ లా ఎఫెక్ట్

డిసెంబర్ 3, 2024న దక్షిణ కొరియా అప్పటి అధ్యక్షుడు యూన్ మార్షల్ లా ప్రకటించి యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని షాక్ కు గురిచేశారు. ఆ సమయంలో ఉత్తర కొరియా దళాల నుంచి దేశాన్ని రక్షించడానికి మార్షల్ లా విధించానని అన్నారు. అయితే దేశీయ రాజకీయ ఇబ్బందుల మధ్య అధికారంపై పట్టు సాధించడానికి యూన్ మార్షల్ లా విధించారని ఆరోపించారు. కొద్ది కాలం పాటు విధించిన మార్షల్ లా..దక్షిణ కొరియాను నెలల తరబడి రాజకీయ గందరగోళంలోకి నెట్టింది. ఆ తర్వాత యూన్ అరెస్టై, సీరియస్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత జూన్ లో జరిగిన ఎన్నికల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యుంగ్ ఎన్నికలయ్యారు.

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×